Disha Patani | దిశా పటానీకి మళ్లీ క్రేజ్.. ఎనిమిదేళ్లకు తొలి హిట్..!
Disha Patani | ‘అవారాపన్ 2’ విజయంతో బాలీవుడ్ కథానాయిక దిశా పటానీకి మళ్లీ క్రేజ్ పెరిగింది. ఇమ్రాన్ హష్మీ రీఎంట్రీకి ఈ చిత్రం బూస్ట్ ఇవ్వడమే కాకుండా.. దిశా కెరీర్‌లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Entertainment | Published On Aug 22, 2026, 4.56 pm IST
Disha Patani | ‘అవారాపన్ 2’ విజయంతో బాలీవుడ్ కథానాయిక దిశా పటానీకి మళ్లీ క్రేజ్ పెరిగింది. ఇమ్రాన్ హష్మీ రీఎంట్రీకి ఈ చిత్రం బూస్ట్ ఇవ్వడమే కాకుండా.. దిశా కెరీర్‌లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. సన్నీ డియోల్ నటించిన ‘బట్వారా 1947’కు గట్టి పోటీ ఇవ్వడం కష్టమేనని చాలామంది భావించినా.. అందుకు భిన్నంగా ‘అవారాపన్ 2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. 2018లో వచ్చిన ‘బాఘీ 2’ తర్వాత దిశాకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ‘భారత్’, ‘మలంగ్’, ‘రాధే’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’, ‘యోధా’ వంటి చిత్రాలు ఆమె కెరీర్‌కు పెద్దగా కలిసిరాలేదు.
‘బాఘీ 3’లో ప్రత్యేక గీతంలో కనిపించినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ భారీ విజయం సాధించినప్పటికీ.. అందులో దిశా పాత్ర పరిమితంగానే ఉంది. ఇక ఆమె చివరి చిత్రం ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ కూడా సగటు ఫలితాన్నే అందుకుంది. అయితే ‘అవారాపన్ 2’ విషయంలో పరిస్థితి మారింది. ఈ సినిమాలో దిశా నటనపై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి స్పందన లభిస్తోంది. నటనలో ఇంకా మెరుగుపడాల్సి ఉన్నప్పటికీ.. తెరపై ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా యువతలో దిశాకు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు అదనపు బలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ హష్మీ సినిమాలపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో.. దిశా తదుపరి చిత్రాలపైనా ఇదే స్థాయిలో బజ్ కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కథలో కీలకమైన పాత్రలు ఎంచుకుని, హావభావాల పరంగా మరింత మెరుగుపడితే ఆమె కెరీర్ మళ్లీ గాడిలో పడే అవకాశముందని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు.. దిశా గ్లామర్‌ను కథకు అనుగుణంగా ఉపయోగించుకునే దర్శకుడి చేతిలో పడితే మంచి ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●తండ్రి నీడ నుంచి… ‘అమ్మ’గా ఎవల్యూషన్: కవిత రాజకీయ వ్యూహాల కొత్త అధ్యాయం
- ●Bulletproof Jackets | అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం యోగి సహా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
- ●POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. పేకమేడలా కూలిన ఏడంతస్తుల భవనం
- ●SHE Teams | పబ్లిక్ ప్లేసుల్లో యువతులను వేధిస్తున్న రోమియోల భరతం పట్టిన షీ టీమ్స్
- ●Paise Ki Goonj | ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్.. రాహుల్ కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు

తండ్రి నీడ నుంచి… ‘అమ్మ’గా ఎవల్యూషన్: కవిత రాజకీయ వ్యూహాల కొత్త అధ్యాయం

Bulletproof Jackets | అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం యోగి సహా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు

POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. పేకమేడలా కూలిన ఏడంతస్తుల భవనం






