TGFDC | బతుకమ్మ పండుగ.. యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కు ఛాలెంజ్..!
TGFDC | బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో ‘యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్-2026.. సీజన్-2’ పోటీలు నిర్వహించనున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు తెలిపారు. శనివారం ఎఫ్‌డీసీ ఎండీ జీ ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిశోర్‌బాబుతో కలిసి పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Entertainment | Published On Aug 22, 2026, 5.08 pm IST
TGFDC | బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో ‘యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్-2026.. సీజన్-2’ పోటీలు నిర్వహించనున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు తెలిపారు. శనివారం ఎఫ్‌డీసీ ఎండీ జీ ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిశోర్‌బాబుతో కలిసి పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండగలు, కళారూపాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై షార్ట్‌ఫిల్మ్‌లు, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు దిల్‌రాజు తెలిపారు. ఈసారి జానపద పాటలు, ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలు, వ్యాసాలకు కూడా అవకాశం కల్పించినట్లు చెప్పారు. యువ ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతలోని సృజనాత్మకతకు ఈ పోటీలు వేదికగా నిలుస్తాయని క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా తెలిపారు. భవిష్యత్‌లో సినీ రంగంలో అవకాశాలకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 15లోపు పంపాలి
షార్ట్‌ఫిల్మ్ నిడివి మూడు నిమిషాలు, పాటల రన్‌టైమ్ ఐదు నిమిషాలకు మించకూడదు. వీడియోలు 4కే రిజల్యూషన్‌లో ఉండాలి. ఆసక్తి ఉన్నవారు తమ ఎంట్రీలను సెప్టెంబర్ 15, 2026లోపు youngfilmmakerschallenge@gmail.com లేదంటే 8125834009 వాట్సాప్ నంబర్‌కు పంపాలి. నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ఎంపిక చేయనుంది. ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్ష చొప్పున అందజేస్తారు. మరో ఐదుగురికి రూ.20 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Disha Patani | దిశా పటానీకి మళ్లీ క్రేజ్.. ఎనిమిదేళ్లకు తొలి హిట్..!
- ●తండ్రి నీడ నుంచి… ‘అమ్మ’గా ఎవల్యూషన్: కవిత రాజకీయ వ్యూహాల కొత్త అధ్యాయం
- ●Bulletproof Jackets | అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం యోగి సహా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
- ●POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Building collapsed in Gachibowli | గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. పేకమేడలా కూలిన ఏడంతస్తుల భవనం
- ●SHE Teams | పబ్లిక్ ప్లేసుల్లో యువతులను వేధిస్తున్న రోమియోల భరతం పట్టిన షీ టీమ్స్

Disha Patani | దిశా పటానీకి మళ్లీ క్రేజ్.. ఎనిమిదేళ్లకు తొలి హిట్..!

తండ్రి నీడ నుంచి… ‘అమ్మ’గా ఎవల్యూషన్: కవిత రాజకీయ వ్యూహాల కొత్త అధ్యాయం

Bulletproof Jackets | అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం యోగి సహా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు

POCO M8x 5G | భారీ బ్యాటరీ, డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..





