Bhatti Vikramarka | పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka | తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్, నీటి కొరత లేకుండా పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, తయారీ, సేవల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Bhatti Vikramarka | తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్, నీటి కొరత లేకుండా పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, తయారీ, సేవల రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పవర్ ఎగ్జిబిషన్-2026’ను శనివారం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగినా నిరంతర సరఫరాకు ఇబ్బంది లేకుండా చేశామని చెప్పారు. గతంలో గరిష్ఠ డిమాండ్ 13 వేల మెగావాట్ల వరకు ఉండగా.. ప్రస్తుతం 18 వేల మెగావాట్లు దాటిందన్నారు. ప్రసార వ్యవస్థను బలోపేతం చేయడం, ముందస్తు ప్రణాళిక, అవసరమైన విద్యుత్ కొనుగోళ్లతో సరఫరాను కొనసాగిస్తున్నామని వివరించారు.
భవిష్యత్ అవసరాలపై ఇప్పటి నుంచే దృష్టి
2047 వరకు విద్యుత్ అవసరాలను అంచనా వేసి లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ఏర్పాటుకు నాలుగైదేళ్లు పడుతుందని, అందుకే భవిష్యత్ అవసరాలపై ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంటుందని చెప్పారు. థర్మల్‌తో పాటు సౌర, జల విద్యుత్, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్‌లో విద్యుత్ కొరత లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను 1912 టోల్‌ఫ్రీ నంబర్, ‘పవర్ అంబులెన్స్’ల ద్వారా వేగంగా పరిష్కరిస్తున్నామని భట్టి తెలిపారు. అవసరమైన పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సిబ్బందితో పవర్ అంబులెన్స్‌లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. వినియోగదారు నంబర్ ఆధారంగా విద్యుత్ సరఫరా ప్రాంతం, మూలం వంటి వివరాలు తెలుసుకునేలా సాంకేతికతను మరింత వినియోగించాలని సూచించారు.
ఆర్థిక ప్రగతికి విద్యుత్‌రంగం కీలకం..
వ్యవసాయం, పరిశ్రమలు, సేవలతో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి విద్యుత్ రంగమే కీలకమని పేర్కొన్నారు. శాఖ ఉద్యోగుల సేవలను అభినందించిన ఆయన.. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి రూ.కోటి ప్రమాద బీమా కల్పించామని, పెండింగ్ పదోన్నతులు ఇచ్చామని తెలిపారు. ప్రజలకు శాఖ చేపడుతున్న సంస్కరణలు, యాప్‌లు, ప్రజాబాట కార్యక్రమం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Manan Kumar Mishra | నేను దిగిపోను.. ఏం చేసుకుంటారో చేసుకోండి .. తెగేసి చెప్పిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా
- ●Konda Surekha | రేవంత్‌పై సెటైర్లు.. కొండా సురేఖకు నోటీసులు.. ఎంటర్ అయిన ఓబీసీ సంఘాలు!
- ●Sugar Prices | చక్కెర ధరలు భగ్గుమంటున్నాయ్.. కారణాలేంటి..?
- ●TGFDC | బతుకమ్మ పండుగ.. యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కు ఛాలెంజ్..!
- ●Murdered | హైదరాబాద్ మీర్పేట్లో దారుణం.. అర తులం బంగారం కోసం స్కూల్ ఆయా హత్య
- ●Disha Patani | దిశా పటానీకి మళ్లీ క్రేజ్.. ఎనిమిదేళ్లకు తొలి హిట్..!

Manan Kumar Mishra | నేను దిగిపోను.. ఏం చేసుకుంటారో చేసుకోండి .. తెగేసి చెప్పిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా

Konda Surekha | రేవంత్‌పై సెటైర్లు.. కొండా సురేఖకు నోటీసులు.. ఎంటర్ అయిన ఓబీసీ సంఘాలు!

Sugar Prices | చక్కెర ధరలు భగ్గుమంటున్నాయ్.. కారణాలేంటి..?

TGFDC | బతుకమ్మ పండుగ.. యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కు ఛాలెంజ్..!




