త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | రేవంత్‌పై సెటైర్లు.. కొండా సురేఖకు నోటీసులు.. ఎంటర్ అయిన ఓబీసీ సంఘాలు!

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్‌లో మంటలు రేపుతున్నాయి. నోటీసుల వ్యవహారంపై బీసీ సంఘాలు సీరియస్ అయ్యాయి.

J

Telangana | Published On Aug 22, 2026, 5.15 pm IST

Konda Surekha | రేవంత్‌పై సెటైర్లు.. కొండా సురేఖకు నోటీసులు.. ఎంటర్ అయిన ఓబీసీ సంఘాలు!
Advertisement
  • సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం
  • పార్టీ వ్యతిరేక వ్యాఖ్యల కింద సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన పీసీసీ క్రమశిక్షణా కమిటీ
  • కొండా కుటుంబానికి మద్దతుగా, అగ్రవర్ణాల కుట్రలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఫైర్
  • ఆగస్టు 23, 2026 ఉదయం 10 గంటలకు గన్ పార్క్ దగ్గర బీసీ సంఘాలు, విద్యార్థి నేతలతో భారీ ప్రెస్ మీట్

Konda Surekha | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే రేపాయి. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న సీనియర్లను పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు సీఎం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయింది. వెంటనే పీసీసీ క్రమశిక్షణా కమిటీ రంగంలోకి దిగి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

సుష్మిత చేసిన ఈ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను స్వయంగా మంత్రి కొండా సురేఖ కూడా ఖండించకపోవడంపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులకు సమాధానంగా తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తాను ఎలా వివరణ ఇస్తానంటూ కొండా సురేఖ ప్రకటించడంతో.. పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా మాట్లాడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ డెవలప్‌మెంట్స్‌తో గాంధీ భవన్ వర్గాల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇలా రచ్చకెక్కడం కేడర్‌ను కూడా గందరగోళానికి గురిచేస్తోంది.

అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకుంది. ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ (All India OBC Association) ఈ నోటీసుల జారీపై తీవ్రస్థాయిలో మండిపడింది. బలహీన వర్గాలకు, బీసీలకు బలమైన నాయకత్వం వహిస్తున్న కొండా సురేఖ కుటుంబాన్ని తొక్కేయడానికి అగ్రకుల నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా ఆదివారం, 23 ఆగస్టు 2026, ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని గన్ పార్క్ ఎదురుగా భారీ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొని తమ మద్దతు తెలుపనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో కూడిన ఒక పోస్టర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement