Bollywood | నాలుగు వందల కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందే – మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీపై హైకోర్టులో కేసు
మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే బాలీవుడ్ హై జవానీతో ఇష్క్ హోనా హై మూవీకి లీగల్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తన అనుమతి లేకుండా బీవీ నంబర్ వన్ సినిమాలోని పాటలు, టైటిల్‌ను వాడారంటూ దర్శకనిర్మాతలపై సీనియర్ నిర్మాత వషు భగ్నానీ కోర్టును ఆశ్రయించారు. నాలుగు వందల కోట్ల పరువు నష్టం దావా వేశారు.
Entertainment | Published On May 29, 2026, 2.50 pm IST
Bollywood | వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ హై జవానీతో ఇష్క్ హోనా హై రిలీజ్ కావడం అనుమానంగా మారింది. డైరెక్టర్ డేవిడ్ ధావన్, నిర్మాత వషు భగ్నానీ మధ్య విభేదాల కారణంగా జూన్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాపడటం ఖాయంగానే కనిపిస్తోంది. తాను నిర్మించిన బీవీ నంబర్ వన్ సినిమాలోని పాటలను అనుమతి లేకుండా వాడుకున్నారంటూ హై జవానీతో ఇష్క్ హోనా హై దర్శకనిర్మాతలపై నిర్మాత వషు భగ్నానీ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. నాలుగు వందల కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
రీమిక్స్ చేశారు...
బీవీ నంబర్ వన్ సినిమాలోని ఇష్క్ సోనా హై పాటలోని లిరిక్స్ ఆధారంగా ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేశారని , ఆ టైటిల్ మార్చాలని వషు భగ్నానీ ఆరోపించారు. చునరీ చునరీతో పాటు ఇష్క్ సోనా హై పాటలను పర్మిషన్ లేకుండా హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలో రీమిక్స్ చేశారని అన్నారు. ఈ పాటలను ఉపయోగించే అధికారం టిప్స్ సంస్థతో పాటు డేవిడ్ ధావన్‌కు లేదని, కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ వషు భగ్నానీ పేర్కొన్నారు. ఈ సినిమా రిలీజ్‌ను ఆపేయడమే కాకుండా డిజిటిల్ రైట్స్ డీల్‌ను నిలిపివేయాలని కోరారు. వషు భగ్నానీ కేసుతో హై జవానీతో ఇష్క్ హోనా హై రిలీజ్ డైలమాలో పడింది.
కూలీ నంబర్ వన్ మూవీ...
మరోవైపు వషు భగ్నానీ పిటిషన్‌తో సంబంధం లేకుండా మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ పలు ఈవెంట్స్‌కు అటెండ్ అవుతోన్నారు.
వషు భగ్నానీ నిర్మించిన బీవీ నంబర్ వన్‌కు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించాడు. ఒకప్పుడు వీరి మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. కానీ వరుణ్ ధావన్ హీరోగా వషు భగ్నానీ నిర్మాణంలో డేవిడ్ ధావన్ తెరకెక్కించిన కూలీ నంబర్ వన్ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతకు ఈ సినిమా 27 కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది. ఈ డిజాస్టర్ వల్లే డేవిడ్ ధావన్, వషు భగ్నానీ మధ్య విభేదాలు మొదలయ్యాయి.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా...
ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకున్న ఓ యువకుడి కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా హై జవానీతో ఇష్క్ హోనా హై ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సక్సెస్‌పై వరుణ్ ధావన్, పూజా హెగ్డే భారీగా ఆశలు పెట్టుకున్నారు.
సంబంధిత వార్తలు

Taapsee | అతడికంటే మంచోడు దొరకలేదు – సీక్రెట్ మ్యారేజ్‌పై తాప్సీ కామెంట్స్
సెప్టెంబర్ 25, 2026

Mrunal Thakur | బ్లడీ రోమియో డబుల్ ధమాకా – ఇద్దరు హీరోయిన్లతో నాచురల్ స్టార్ రొమాన్స్!
సెప్టెంబర్ 25, 2026

Alia Bhatt | బోల్డ్ లుక్‌లో అలియా భట్ – భర్త సినిమాలో క్యాబరే డ్యాన్సర్‌గా బాలీవుడ్ బ్యూటీ
సెప్టెంబర్ 25, 2026
తాజావార్తలు
- ●NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..
- ●Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు
- ●CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!
- ●Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు
- ●Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
- ●Kunal Ghosh | దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..

Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు

CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!

Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు



