IMD | ఈసారి సాధారణం కంటే తక్కువే వర్షాలు.. జూన్‌లో అధిక ఉష్ణోగ్రతలు : ఐఎండీ
IMD | వర్షాలపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే (Weaker Monsoon) అవకాశం ఉందని తెలిపింది.
IMD | వర్షాలపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే (Weaker Monsoon) అవకాశం ఉందని తెలిపింది. జూన్ నెలలో అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ సాగే ఈ రుతుపవనాల సీజన్‌లో దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటులో 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనికి ఎర్రర్ మార్జిన్ నాలుగు శాతంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎల్‌నినో (El Nino) ప్రభావంతో పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
నైరుతి రాక మరింత ఆలస్యం
మహాపాత్ర తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం అవుతోంది. ముందుగా అంచనా వేసిన ప్రకారం.. నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే నాలుగు రోజుల ముందే, అంటే మే 16 నాటికి అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. ఆ తర్వాత మే 28 నాటికి అవి దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతాలకు విస్తరించాయి. అవి కేరళను తాకేందుకు సమయం పట్టేలా ఉంది. జూన్ 4, 5 తేదీల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. అయితే, మే 26నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ ముందుగా అంచనా వేసిన విషయం తెలిసిందే. కానీ, ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో ఈ అంచనాలు తలకిందులయ్యాయి.
జూన్‌లో అధిక ఉష్ణోగ్రతలు..
ఇక జూన్ నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు (Heatwaves) నమోదవుతాయని మృత్యుంజయ్ వివరించారు. మధ్య, వాయువ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్ , హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగ వడగాలుల వీచే అవకాశం ఉంటుందని తెలిపారు.
తాజావార్తలు
- ●NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..
- ●Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు
- ●CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!
- ●Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు
- ●Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
- ●Kunal Ghosh | దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..

Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు

CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!

Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు






