Samajik Parivartan Morcha | బీజేపీకి చెక్ పెట్టడమే లక్ష్యం.. కొత్త కూటమి ఏర్పాటు చేసిన అజాద్, ఒవైసీ
Samajik Parivartan Morcha | అసెంబ్లీ ఎన్నికలు (2027 UP Elections) సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్డీఏ (NDA), ఇండీ (INDIA) కూటములకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటైంది. రాష్ట్రంలో బీజేపీ 3.0ని అడ్డుకోవడమే లక్ష్యంగా 'సామాజిక పరివర్తన మోర్చా' (Samajik Parivartan Morcha) పేరుతో చంద్రశేఖర్ అజాద్ (Chandrashekhar Azad), అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి సీఎం అభ్యర్థిగా అజాద్ బరిలోకి దిగనున్నారు.
- సామాజిక పరివర్తన మోర్చా పేరుతో కూటమి ఏర్పాటు
- సీఎం అభ్యర్థిగా అజాద్
- అన్ని స్థానాల్లోనూ పోటీ
Samajik Parivartan Morcha | త్రినేత్ర న్యూస్ : 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (2027 UP Elections) నేపథ్యంలో రాష్ట్రంలో మూడో రాజకీయ కూటమి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో బీజేపీ 3.0ని అడ్డుకోవడమే లక్ష్యంగా చంద్రశేఖర్ అజాద్ (Chandrashekhar Azad) నేతృత్వంలోని అజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్ - ASP), అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) నేతృత్వంలోని ఎంఐఎం (AIMIM) పార్టీలు కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశాయి. ఇవాళ లక్నోలో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో 'సామాజిక పరివర్తన మోర్చా'ను (Samajik Parivartan Morcha) ఏర్పాటు చేస్తున్నట్లు ఇరు పార్టీల నేతలు అధికారికంగా ప్రకటించారు.
సీఎం అభ్యర్థిగా అజాద్..
ఈ మేరకు కూటమి వివరాలను ఒవైసీ వెల్లడించారు. కూటమి తరఫున చంద్రశేఖర్ అజాద్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా (CM Face) బరిలోకి దిగనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ (BJP) అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఒవైసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, ఇతర అణగారిన వర్గాల సమస్యలపై తమ కూటమి ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. ఇది ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఒవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీని అడ్డుకోవడంతో పాటు ఉత్తర్ ప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ పరిస్థితి, నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలపై కూటమి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
అన్ని స్థానాల్లోనూ పోటీ..
యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనుకునే మరే ఇతర పార్టీ అయినా తమ కూటమికి మద్దతుగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చంద్రశేఖర్ అజాద్ తెలిపారు. ఈ కూటమిని 'మూడో కూటమి' (థర్డ్ ఫ్రంట్) అని పిలవడాన్ని తప్పుపట్టిన ఆజాద్, ఇది సమాజంలోని అణగారిన, పీడిత, అట్టడుగు వర్గాలకు ఒక బలమైన రాజకీయ వేదికగా మారుతుందని పేర్కొన్నారు. సీట్ల పంపకానికి సంబంధించి భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము కలిసే పోటీ చేస్తామని వెల్లడించారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అట్టడుగు వర్గాల పరిస్థితులను మెరుగుపరచడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక మార్పు కోసం జరిగే ఉద్యమానికి ఇది నాంది అని పేర్కొంటూ... నవంబర్ 26న నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా కూటమి నేతలు ప్రజలను ఆహ్వానించారు.
దళిత, మైనారిటీ ఓటర్లను ఏకం చేయడమే లక్ష్యం
కాగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA), సమాజ్‌వాదీ పార్టీ (SP)-కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ (INDIA) కూటములకు ప్రత్యామ్నాయంగా ఈ కూటమి ఏర్పడింది. రాష్ట్రంలో దళితులు 21 శాతం, ముస్లింలు 19 శాతంగా ఉన్నారు. ఈ రెండు వర్గాలు కలిపి రాష్ట్ర జనాభాలో దాదాపు 40 శాతం వరకూ ఉంటాయి. ఈ రెండు వర్గాల ఓటు బ్యాంకును ఏకం చేయడం ఈ కూటమి ప్రధాన లక్ష్యంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్, రోహిల్‌ఖండ్ ప్రాంతాల్లోని దళిత, ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలపై ఈ కూటమి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దళిత ఓటర్లను బలంగా ఆకర్షించిన బీఎస్పీ (BSP) క్రమంగా బలహీనపడుతుండటంతో.. ఆ ఖాళీని భర్తీ చేయాలని అజాద్ పార్టీ చూస్తోంది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపిన దళిత, ముస్లిం ఓటర్లను ఈ కొత్త కూటమి ఎంతవరకు ఆకర్షిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read..
నీ ఇష్టమొచ్చింది చేసుకోపో.. అన్నంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటారా? భర్తపై కేసు పెడతారా?
భారతీయ వీసాల ప్రక్రియ మరింత సులభతరం.. కేటగిరీల సంఖ్య 13 నుంచి 9కి కుదింపు
"ఇడుపుకాయితం" వివాదం - స్పందించిన డైరెక్టర్ సుకుమార్ సతీమణి
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Ramchandar Rao | విదేశీ వైద్య విద్యార్థులకు సమాన స్టైపెండ్ చెల్లించాలి
- ●Arvind Kejriwal | రూ.7 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు
- ●Sekhar Master | అయ్యప్ప దయ వల్ల క్షేమంగా బయటపడ్డా - షూటింగ్‌కు వెళుతున్నా - రోడ్డు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ క్లారిటీ
- ●India Russian Oil Imports | రష్యా నుంచి భారత్‌కు భారీగా చమురు దిగుమతులు.. అక్టోబర్‌లో రికార్డు స్థాయికి..
- ●Stock Markets | వరుసగా మూడో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రికార్డు దిశగా బ్యాంక్ నిఫ్టీ..

Ponnam Prabhakar | గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం : మంత్రి పొన్నం ప్రభాకర్

Ramchandar Rao | విదేశీ వైద్య విద్యార్థులకు సమాన స్టైపెండ్ చెల్లించాలి

Arvind Kejriwal | రూ.7 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు

Sekhar Master | అయ్యప్ప దయ వల్ల క్షేమంగా బయటపడ్డా - షూటింగ్‌కు వెళుతున్నా - రోడ్డు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ క్లారిటీ






