త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sekhar Master | అయ్య‌ప్ప ద‌య వ‌ల్ల క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డా – షూటింగ్‌కు వెళుతున్నా – రోడ్డు ప్ర‌మాదంపై శేఖ‌ర్ మాస్ట‌ర్ క్లారిటీ

గురువారం ఉద‌యం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ గాయ‌ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రోడ్డు ప్ర‌మాదంపై శేఖ‌ర్ మాస్ట‌ర్ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. యాక్సిడెంట్ జ‌రిగింది నిజ‌మే కానీ అయ్య‌ప్ప ద‌య వ‌ల్ల తాను క్షేమంగా బ‌య‌ట‌ప‌డిన‌ట్లు చెప్పారు.

N

Entertainment | Published On Nov 12, 2026, 4.19 pm IST

Sekhar Master | అయ్య‌ప్ప ద‌య వ‌ల్ల క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డా – షూటింగ్‌కు వెళుతున్నా – రోడ్డు ప్ర‌మాదంపై శేఖ‌ర్ మాస్ట‌ర్ క్లారిటీ
Advertisement

Sekhar Master | టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన‌ట్లు గురువారం ఉద‌యం వార్త‌లొచ్చాయి. ఓ సినిమా షూటింగ్ ముగించుకొని తిరిగివ‌స్తోండ‌గా ఆయ‌న ప్ర‌యాణిస్తోన్న కారును ఓ ట్ర‌క్కు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో శేఖ‌ర్ మాస్ట‌ర్ కారు పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. ఆయ‌న‌కు స్వ‌ల్ప గాయాలు అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

నుజ్జునుజ్జు...

ఈ ప్ర‌మాదంపై ఓ వీడియో ద్వారా శేఖ‌ర్ మాస్ట‌ర్ క్లారిటీ ఇచ్చాడు. "నిన్న నైట్ షూటింగ్ జ‌రిగింది. చిత్రీక‌ర‌ణ‌ను ముగించుకొని ఉద‌యం ఐదున్న‌ర గంట‌ల టైమ్‌లో ఇంటికి తిరిగి వ‌స్తోండ‌గా యాక్సిడెంట్ జ‌రిగింది. కారు వెనుకాల భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఆ ప్ర‌మాద స‌మ‌యంలో కారులో న‌లుగురం ఉన్నా. కానీ ఎవ్వ‌రికి ఏం కాలేదు. అయ్య‌ప్ప ద‌య వ‌ల్ల అంద‌రం బాగున్నాం. ఈ రోజు రాత్రి మ‌ళ్లీ షూటింగ్‌కు వెళుతున్నా. ఈ ప్ర‌మాదం గురించి చాలా మంది ఫోన్లు, మెసేజ్‌లు పెడుతున్నారు. అంద‌రికి క్లారిటీ ఇవ్వాల‌నే ఈ వీడియో పెడుతున్నా" అని శేఖ‌ర్ మాస్ట‌ర్ అన్నారు.

చిరంజీవి కాకా...

చిరంజీవి కాకా మూవీ షూటింగ్ ముగించుకొని వ‌స్తోన్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

Advertisement
Advertisement