త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Idupu Kayitham | “ఇడుపుకాయితం” వివాదం – స్పందించిన డైరెక్ట‌ర్ సుకుమార్ స‌తీమ‌ణి

ఇడుపుకాయితం సినిమాపై వ‌స్తోన్న వివాదాల‌పై డైరెక్ట‌ర్ సుకుమార్ స‌తీమ‌ణి త‌బిత స్పందించారు. ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీ డిసెంబ‌ర్ 11న రిలీజ్ కాబోతుంది. బ‌న్నీవాస్‌తో క‌లిసి త‌బిత సుకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇడుపుకాయితం మూవీ టీజ‌ర్ గురువారం రిలీజైంది.

N

Entertainment | Published On Nov 12, 2026, 3.47 pm IST

Idupu Kayitham | “ఇడుపుకాయితం” వివాదం – స్పందించిన డైరెక్ట‌ర్ సుకుమార్ స‌తీమ‌ణి
Advertisement

Idupu Kayitham | ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ జంట‌గా న‌టించిన ఇడుపుకాయితం మూవీని అనౌన్స్‌మెంట్ నుంచే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ కాంట్ర‌వ‌ర్సీల‌పై టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ సుకుమార్ స‌తీమ‌ణి త‌బిత రియాక్ట్ అయ్యారు. వంశీరెడ్డి దొండ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను బ‌న్నీవాస్‌తో క‌లిసి త‌బిత సుకుమార్ నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 11న ఇడుపుకాయితం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ముక్కు కారితే ల‌వ్ చేయ‌వా...

ఈ మూవీలో శ్రీనివాస్ పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి, శ్రీల‌త‌గా నాగ‌దుర్గ న‌టిస్తున్నారు. వారిద్ద‌రి పెళ్లి వేడుక చుట్టూ టీజ‌ర్ ఆహ్లాదంగా సాగింది. ముక్కుకారితే ల‌వ్ చేయ‌వా అంటూ అంటూ నాగ‌దుర్గ చెప్పిన డైలాగ్ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది.

తెలంగాణ క‌ల్చ‌ర్‌..

టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో ఇడుపుకాయితం సినిమాపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై త‌బిత సుకుమార్‌తో పాటు బ‌న్నీవాస్‌, ప్రియ‌ద‌ర్శి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ క‌ల్చ‌ర్‌తో తెర‌కెక్కుతోన్న సినిమాల్లో మందు తాగే స‌న్నివేశాల‌ను ఎక్కువ చూపిస్తున్నారంటూ వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై త‌బిత సుకుమార్ రియాక్ట్ అయ్యారు.

తెలంగాణ‌లోనే పుట్టి పెరిగా...

"ఓ వేడుక జ‌రుగుతున్న‌ప్పుడు పెద్ద‌వాళ్ల‌ను సంతోష‌పెట్ట‌డానికి మందు పోయ‌డం, నాన్‌వెజ్ వ‌డ్డించ‌డం చేస్తుంటారు. వేడుక‌కు హాజ‌రైన వాళ్ల‌తో త‌మ సంతోషాన్ని పంచుకోవ‌డానికే ఇలా చేస్తుంటారు. త‌ప్పితే తెలంగాణ క‌ల్చ‌ర్‌లో అదొక భాగం మాత్రం కాద‌ని" త‌బిత సుకుమార్ తెలిపారు. అంతే కాకుండా "డైరెక్టర్ వంశీరెడ్డి కథ ఎంత బాగా చెప్పాడో, అంతే బాగా సినిమా తెరకెక్కించాడు. బ్యూటిఫుల్ స్టోరీతో రూపొందింది. సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ కథను రిలేట్ చేసుకుంటారు. నేను తెలంగాణ‌లోనే పుట్టి పెరిగాను కాబట్టి పెళ్లి సంప్రదాయాలు, పెద్దవాళ్లు మాట్లాడుకునే మాటలు, ఆ చర్చలన్నీ ఎలా ఉంటాయో నా చిన్న‌త‌నంలో చూశాను. అవన్నీ ఈ సినిమా మ‌రోసారి గుర్తుకుతెచ్చింది. సినిమా చూస్తున్న‌ప్పుడు ఆడియెన్స్‌కు అదే ఫీల్ కలుగుతుందని నమ్ముతున్నాను" అని త‌బిత సుకుమార్ చెప్పారు.

ఏం చేసినా వివాద‌మే...

"ఇడుపుకాయితం సినిమా కోసం ఏం చేసినా కాంట్రవర్సీ అవుతుందనే భయం మ‌మ్మ‌ల్ని వెంటాడుతోంది. టైటిల్ నుంచే ఈ టెన్ష‌న్‌ మొదలైంది. ఈ వివాదాలు అన్నీ సిల్లీగా అనిపించాయి. ఇందులో ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాలను చూపిస్తూ అక్కడక్కడా నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ డైరెక్టర్ ఆకట్టుకునేలా ఇడుపుకాయితం సినిమాను తెరకెక్కించారు. మాటలు మన ఇంట్లో మాట్లాడుకున్నట్లే ఉంటాయి. ఎక్కడా సినిమాటిక్ గా ఉండదు. ప్రియదర్శి ఈ కథ తీసుకొచ్చి మాతో సినిమా చేయించారు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కూడా ఆయనకే వెళ్తుంది. మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ కానీ వ‌ర్క‌వుట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు అలాంటి మూవీస్ ఆడియెన్స్‌ చూస్తారంటూ ముందుకొచ్చారు తబిత సుకుమార్ ముందుకొచ్చారు" అని బ‌న్నీవాస్ పేర్కొన్నారు.

సినిమా రంగానికి ఆంధ్రా తెలంగాణ భేదాలు ఉండ‌వ‌ని, సినిమా కోసం రెండు రాష్ట్రాల వారు ప‌నిచేశార‌ని ప్రియ‌ద‌ర్శి అన్నారు. టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో నాగ‌దుర్గ‌, చంద్ర‌వ్వ‌, శివ‌జ్యోతితో పాటు డైరెక్ట‌ర్ వంశీరెడ్డి దొండ‌పాటి పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement