త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | విదేశీ వైద్య విద్యార్థులకు స‌మాన స్టైపెండ్ చెల్లించాలి

Ramchandar Rao | విదేశీ వైద్య విద్యార్థుల‌ (Foreign Medical Graduates)కు నెలకు రూ.29,792 చొప్పున సమాన స్టైపెండ్ (Stipend) చెల్లించాలని.. 2026, జ‌న‌వ‌రి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు (Ramchandar Rao) డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Nov 12, 2026, 4.26 pm IST

Ramchandar Rao | విదేశీ వైద్య విద్యార్థులకు స‌మాన స్టైపెండ్ చెల్లించాలి
Advertisement
  • సుప్రీంకోర్టు తీర్పునే ధిక్క‌రించ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌నే
  • ఏడాదికి రూ.2 కోట్లు ఖర్చు చేయలేని దుస్థితిలో ఉన్న‌రా?
  • బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు నిల‌దీత‌

Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: విదేశీ వైద్య విద్యార్థుల‌(Foreign Medical Graduates)కు నెలకు రూ.29,792 చొప్పున సమాన స్టైపెండ్ (Stipend) చెల్లించాలని.. 2026, జ‌న‌వ‌రి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు (Ramchandar Rao) డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఫైర‌య్యారు. ఒకరికి నెలకు రూ.29,792 చెల్లిస్తుంటే.. మరొకరికి కేవలం రూ.5,000 మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. న్యాయం అడిగితే చర్చలకు పిలవాల్సింది పోయి లాఠీలు ఝుళిపించి తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర‌ కార్యాల‌యంలో వైద్య విద్యార్థుల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. ఏడాదికి రూ. 2 కోట్లు కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా? అని ప్ర‌శ్నించారు.

ఒకే ఆసుపత్రిలో, ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మెడికల్ ఇంటర్న్‌లకు వేర్వేరు స్టైపెండ్లు ఎలా చెల్లిస్తారు? ఒకరికి నెలకు రూ.29,792 చెల్లిస్తుంటే.. మరొకరికి కేవలం రూ.5,000 మాత్రమే చెల్లిస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ వైద్య విద్యార్థుల (FMG- Foreign Medical Graduates) పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇదే.

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి, కఠినమైన FMGE పరీక్షలో ఉత్తీర్ణులై, మన ఆసుపత్రుల్లో సేవలందించేందుకు అర్హత సాధించిన ఈ యువ వైద్యులకు.. వారితో సమానంగా హౌస్ సర్జన్లుగా పనిచేస్తున్న ఇతర వైద్యులకు చెల్లిస్తున్న స్టైఫండ్‌ను నిరాకరిస్తున్నారు. సమాన స్టైపెండ్ చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సైతం ఈ అహంకారపూరిత ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. 34 రోజులుగా యువ వైద్యులు నిరసనలు తెలుపుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందించింది?

యువ వైద్యుల సమస్యలను వినాల్సింది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై పోలీసులతో దౌర్జన్యానికి పాల్పడుతోంది. వైద్యులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం ఏడాదికి కేవలం రూ.2 కోట్లు మాత్రమే. యువ వైద్యుల కోసం ఏడాదికి రూ.2 కోట్లు ఖర్చు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదా?

వెంటనే ప్రభుత్వం స్పందించి, విదేశీ వైద్య పట్టభద్రులకు (FMG) నెలకు రూ.29,792 చొప్పున సమాన స్టైపెండ్ చెల్లించాలి. న్యాయం జరిగే వరకు FMG వైద్య విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుంది అని రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement