త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | గిగ్ వ‌ర్క‌ర్ల సంక్షేమం కోసం ప్ర‌త్యేక చ‌ట్టం : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

Ponnam Prabhakar | సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. నవంబర్ 14వ తేదీన గిగ్ వర్కర్క్‌తో లోక్‌స‌భ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టే ర్యాలీలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్స్ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Nov 12, 2026, 4.36 pm IST

Ponnam Prabhakar | గిగ్ వ‌ర్క‌ర్ల సంక్షేమం కోసం ప్ర‌త్యేక చ‌ట్టం : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. నవంబర్ 14వ తేదీన గిగ్ వర్కర్క్‌తో లోక్‌స‌భ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టే ర్యాలీలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్స్ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఫహీం ఖురేషిలతో కలిసి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడారు.

గత పదేళ్లుగా పెరగని ఆటో ఛార్జీలను పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా పెంచాం. ఆటో డ్రైవర్ల చిరకాల డిమాండ్ అయిన వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు అంగీకారం తెలిపి చట్టబద్ధంగా చర్యలు ప్రారంభించాం. క్యాబ్, ట్యాక్సీ, ర్యాపిడో తదితర అగ్రిగేటర్ రంగాల్లో పనిచేసే వారి సంక్షేమానికి కూడా ప్రత్యేక చట్టం తీసుకొస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌క‌టించారు.

మహిళా సంఘాలకు గతంలో ఉన్న రూ.5 లక్షల రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు.. వడ్డీ లేని రుణాల పంపిణీ చేస్తున్నాం. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమై కుటుంబాలను పోషించుకునేలా ప్రజాపాలన ప్రభుత్వం చేయూత అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకొని.. దీపావళి పండుగను కొత్త ఇళ్లలో రెండున్నర లక్షల మంది లబ్ధిదారులు జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంలో పేదలు, నిరుద్యోగుల కోసం లక్ష ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. ఎకరం రూ.100 కోట్ల విలువైన ఖరీదైన ప్రాంతాల్లోనూ పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఆర్టీసీ, పోలీస్ శాఖలకు చెందిన స్థలాల్లోనూ పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. ప్రజలు పనిచేసే ప్రాంతాలకు సమీపంలోనే నివాసం ఉండేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామ‌ని మంత్రి పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రవాణా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేస్తున్నాం. హైదరాబాద్ నగరం ఢిల్లీ తరహా కాలుష్య నగరంగా మారకుండా చర్యలు చేపట్టింది. రూ.200 కోట్లతో పాత ఆటోలను ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే రెట్రోఫిట్ కార్యక్రమం తీసుకున్నాం. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్ర‌జాపాల‌న ప్ర‌భుత్వం పెద్దపీట వేస్తుంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement