Street Dog | అమానవీయ ఘటన.. కుక్కమెడకు ఇటుక కట్టి.. నదిలోకి తోసేశారు
Street Dog | బంగ్లాదేశ్ (Bangladesh)లో కొందరు యువకులు మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. కుక్క (Street Dog) మెడకు ఇటుక రాయిని కట్టి నదిలోకి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
International | Published On Jun 29, 2026, 5.43 pm IST
Street Dog | ఓ వీధి కుక్క (Street Dog) పట్ల కొందరు యువకులు అమానుషంగా ప్రవర్తించారు. మూగజీవి మెడకు ఇటుక రాయిని కట్టి ఓ నదిలో పడేసి సునకానందం పొందారు. ఈ అమానవీయ ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. నర్సింగ్డి మోడల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్రియాకండి వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ యువకుడు కుక్క మెడకు తాడు కట్టాడు. ఆ తాడు చివరన ఇటుక రాయిని కట్టి తన స్నేహితుడి సాయంతో ఆ కుక్కను నదిలోకి విసిరేశాడు. దీంతో ఆ శునకం నీటిలో కొట్టుకుపోతూ ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే, ఇటుక బరువు ఉండటంతో ఆ మూగజీవి నీటి ప్రవాహంలో మునిగిపోయి కొట్టుకుపోయింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా బాధకరమని, అమానవీయమైన చర్య అంటూ మండిపడుతున్నారు. జంతు సంరక్షణ చట్టం కింద నిందితుడిని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని మహమ్మద్ అలీగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
A innocent street dog brutually K!lled by Bangladeshi 🇧🇩young men.😡https://t.co/HPquWFSACn
— Musaltaa (☀️ ➡️ 🤲 × 5️⃣ = 🛐) (@Musaltaa) June 25, 2026
తాజావార్తలు
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం
- ●South Heroines | సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా! పాన్ ఇండియా కోసం బోల్డ్ రోల్స్‌కు సై..!
- ●Konda Sushmitha | జనసేనలోకి కొండా సుష్మిత.. క్లారిటీ ఇచ్చిన పార్టీ
- ●PJTAU | 27 నుంచి అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్
- ●Onam | ఓనం పండుగకు సినీ గ్లామర్.. సంప్రదాయ లుక్‌లో హీరోయిన్ల మెరుపులు!
- ●BJP Welfare Schemes 2026 | 'ఉచితాల'పై యూటర్న్? దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఇదే..!

Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

South Heroines | సౌత్‌లో ఒకలా.. నార్త్‌లో మరోలా! పాన్ ఇండియా కోసం బోల్డ్ రోల్స్‌కు సై..!

Konda Sushmitha | జనసేనలోకి కొండా సుష్మిత.. క్లారిటీ ఇచ్చిన పార్టీ

PJTAU | 27 నుంచి అగ్రికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్






