Sheikh Hasina | డిసెంబర్‌లో స్వదేశానికి.. లొంగిపోయేందుకు సిద్ధం : షేక్ హసీనా కీలక ప్రకటన
Sheikh Hasina | ఈ ఏడాది డిసెంబర్‌లో స్వదేశాని (Bangladesh)కి వెళ్లనున్నట్లు బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి (Sheikh Hasina) కీలక ప్రకటన చేశారు. అక్కడ కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
International | Published On Jul 10, 2026, 5.21 pm IST
Sheikh Hasina | త్రినేత్ర.న్యూస్ : దాదాపు రెండేళ్లుగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో తాను తిరిగి స్వదేశానికి వెళ్లనున్నట్లు తెలిపారు. అక్కడ కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ హసీనా మాట్లాడుతూ.. "నేను వెళ్లగానే వాళ్లు నన్ను అరెస్టు చేయొచ్చు.. హతమార్చవచ్చు కూడా. అయినా సరే నేను స్వదేశానికి వెళ్లి తీరుతా. నా పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఒకవేళ మరణం సంభవిస్తే.. అది నా తల్లిదండ్రులను ఖననం చేసిన చోట, వారి రక్తం చిందిన నా సొంత గడ్డపైనే చనిపోవాలని కోరుకుంటున్నాను" అని హసీనా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ డిసెంబర్‌లో తన పార్టీకి చెందిన సీనియర్ నేతలు, తాను స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అక్కడ న్యాయస్థానం ముందు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు హసీనా వెల్లడించారు.
కాగా, రిజర్వేషన్ల అంశంలో చెలరేగిన వివాదం కారణంగా.. విద్యార్థుల నిరసనలకు జడిసి 2024 ఆగస్టు 5న ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం బంగ్లానుంచి పారిపోయి భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం భారత్‌లోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు. హసీనా దేశం విడిచి వచ్చిన తర్వాత బంగ్లాలో ఆమెపై అనేక కేసులు నమోదయ్యాయి. ఆయా కేసులపై విచారణ జరిపిన బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్.. 2025లో హసీనాకు మరణశిక్ష విధించింది.
సంబంధిత వార్తలు

Shakib Al Hasan | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి..
ఆగస్టు 6, 2026

Street Dog | అమానవీయ ఘటన.. కుక్కమెడకు ఇటుక కట్టి.. నదిలోకి తోసేశారు
జూన్ 29, 2026

Sheikh Hasina | ఉరిశిక్ష వేసినా భయపడను.. ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!



