Crude Crisis | పెరుగుతున్న క్రూడాయిల్ ధరలతో.. భారీ నష్టాల్లో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు..!
Crude Crisis | ఇరాన్, ఇజ్రాయెల్-యూఎస్ యుద్ధం ప్రభావం క్రూడాయిల్‌పై పడుతోంది. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు.
Crude Crisis | ఇరాన్, ఇజ్రాయెల్-యూఎస్ యుద్ధం ప్రభావం క్రూడాయిల్‌పై పడుతోంది. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కారణంగా ఆయిల్ కంపెనీల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ.18, డీజిల్‌పై లీటరుకు సుమారు రూ.35 మేర నష్టాలు వస్తున్నట్లు సమాచారం. మార్చి నెలలో వచ్చిన భారీ నష్టాలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన లాభాలను దాదాపు పూర్తిగా తుడిచిపెట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో ఆయిల్ కంపెనీలు నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా.
ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మాక్వారీ (Macquarie) నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 135–165 డాలర్ల మధ్య కొనసాగితే నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. క్రూడ్ ధరలు ప్రతి 10 డాలర్లు పెరిగినప్పుడు లీటరుకు సుమారు రూ.6 వరకు అదనపు నష్టం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు 2022 ఏప్రిల్ తర్వాత రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. మార్చి వరకు ఈ మూడు కంపెనీలకు కలిపి రోజువారీగా సుమారు రూ.2,400 కోట్ల నష్టం వస్తున్నట్లు అంచనా. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.10 తగ్గించిన తర్వాత ఈ నష్టం సుమారు రూ.1,600 కోట్లకు తగ్గినట్లు తెలిపింది.
భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులు కలిగి ఉండటంతో క్రూడ్ షాక్‌ను కొంతవరకు తట్టుకోగలదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు సుమారు 130 డాలర్ల వద్ద కొనసాగితే దేశ ఆర్థిక వృద్ధి రేటు సుమారు 0.8 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ ప్రకారం.. 2026–27 కాలంలో ఆయిల్ కంపెనీల ఆపరేటింగ్ ఆదాయం 15 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో కార్పొరేట్ రుణాలు, బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి పెరిగి, బ్యాంకుల నిరర్థక ఆస్తులు (NPA's) 3.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
సెప్టెంబర్ 29, 2026

CEC Gyanesh Kumar | వందకు కోటి పర్సెంట్ జ్ఞానేశ్వర్ కుమార్ పదవీచ్యుతుడవుతాడు.. బల్ల గుద్ది చెప్పిన వేణు స్వామి..!
సెప్టెంబర్ 28, 2026

SIR | సైమన్ గో బ్యాక్‌లా.. సర్ గో బ్యాక్ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Vivo India | దేశవ్యాప్తంగా 10 మంది టీచర్లకు వివో ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్
- ●Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
- ●Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం
- ●Paradise Movie | మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ పై అదిరిపోయే డీల్.. రూ.57 వేల వరకు ఆదా..
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Vivo India | దేశవ్యాప్తంగా 10 మంది టీచర్లకు వివో ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్

Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు

Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం

Paradise Movie | మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు



