త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meenakshi Natarajan | ఇక పాలాభిషేకాలు, జలాభిషేకాలు నిషేధం.. జేసీబీలతో దండలు వేయొద్దు..

Meenakshi Natarajan | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాలాభిషేకాలు, జలాభిషేకాలు, జేసీబీలతో దండలు వేయడం వంటివి చేయొద్ద‌ని ఆమె ఆదేశించారు.

S

Telangana | Published On Jul 16, 2026, 3.19 pm IST

Meenakshi Natarajan | ఇక పాలాభిషేకాలు, జలాభిషేకాలు నిషేధం.. జేసీబీలతో దండలు వేయొద్దు..
Advertisement
  • పార్టీ శ్రేణుల‌కు మీనాక్షి ఆదేశం

Meenakshi Natarajan | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాలాభిషేకాలు, జలాభిషేకాలు, జేసీబీలతో దండలు వేయడం వంటివి చేయొద్ద‌ని ఆమె ఆదేశించారు. ఆమె సూచించిన విరాల‌ను తెలియ‌జేస్తూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు టి. కుమార్ రావు గురువారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అందులో మీనాక్షి చెప్పిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

ఆహార వృథాకు దారితీసే ఈ పద్ధతులకు బదులుగా అవసరమైన వారికి ఆహార పంపిణీ చేపట్టాలని సూచించారు. పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్న వారికి ఆ ఆహారాన్ని దానం చేయాల‌ని సూచించారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు వ‌చ్చిన‌ప్పుడు కొందరు నాయ‌కులు జేసీబీలు, బుల్డోజ‌ర్ల‌తో భారీ గ‌జ‌మాల‌లు వేస్తున్నార‌ని ఈ వాహ‌నాలు అణ‌చివేత‌కు చిహ్నాలు అని పేర్కొన్నారు. ఇప్ప‌టి నుండి ఎవ‌రైనా జేసీబీలు, బుల్డోజ‌ర్ల‌తో భారీ గ‌జ‌మాల‌ల‌ను నాయ‌కుల‌కు వేస్తే క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఈ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయన్నారు.

Advertisement
Advertisement