త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | కాజ‌ల్‌, త‌మ‌న్నా బాట‌లో న‌య‌న్‌ – మెగా హీరో మూవీలో లేడీ సూప‌ర్ స్టార్‌

చిరంజీవి, న‌య‌న‌తార కాంబోలో వ‌చ్చిన మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు ఈ ఏడాది టాలీవుడ్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు త‌ర్వాత తెలుగులో న‌య‌న్ మ‌రో మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. త‌మ‌న్నా, కాజ‌ల్‌తో పాటు శృతి హాస‌న్ బాట‌లోనే ఈ ముద్దుగుమ్మ అడుగులు వేయ‌బోతుంద‌ట‌.

N

Entertainment | Published On Jul 16, 2026, 3.19 pm IST

Nayanthara | కాజ‌ల్‌, త‌మ‌న్నా బాట‌లో న‌య‌న్‌ – మెగా హీరో మూవీలో లేడీ సూప‌ర్ స్టార్‌
Advertisement

Nayanthara |  తండ్రితో...ఆ త‌ర్వాత కొడుకుతో క‌లిసి ఓ హీరోయిన్ సినిమా చేయ‌డం అన్న‌ది అరుదు. అలాంటి రేర్ కాంబినేష‌న్ టాలీవుడ్‌లో చాలా సార్లే రిపీట్ అయ్యింది. మెగా హీరోలు చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ ....ఇద్ద‌రితో కొంద‌రు హీరోయిన్లు సినిమాలు చేశారు. రామ్‌చ‌ర‌ణ్ మ‌గ‌ధీర‌, నాయ‌క్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన కాజ‌ల్‌...ఆ త‌ర్వాత ఖైదీ నంబ‌ర్ 150లో చిరంజీవికి జోడీగా క‌నిపించింది. రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ సినిమా చేసిన త‌మ‌న్నా ...చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డిలో ఓ హీరోయిన్‌గా న‌టించింది. రామ్‌చ‌ర‌ణ్ ఎవ‌డులో హీరోయిన్‌గా క‌నిపించిన శృతి హాస‌న్ ఆ త‌ర్వాత వాల్తేర్ వీర‌య్యలో చిరంజీవి స‌ర‌స‌న క‌నిపించింది.

లేడీ సూప‌ర్ స్టార్‌...

వీరి బాట‌లోనే లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కూడా అడుగులు వేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీతో కెరీర్‌లోనే పెద్ద హిట్టును అందుకున్నారు చిరంజీవి. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. థియేట‌ర్ల‌లో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీ మూడు వంద‌ల యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

సుకుమార్ సినిమాలో...

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు త‌ర్వాత తెలుగులో మ‌రో భారీ బ‌డ్జెట్ మూవీకి లేడీ సూప‌ర్ స్టార్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ సారి కూడా మెగా హీరోతోనే సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. పెద్ది త‌ర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో రామ్‌చ‌ర‌ణ్ ఓ సినిమా చేయ‌బోతున్నారు. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ మూవీ ఆగ‌స్ట్ లేదా సెప్టెంబ‌ర్‌లో సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

సేమ్ స్క్రీన్ టైమ్‌....

ఆర్‌సీ 17 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో న‌య‌న‌తార ఓ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. చ‌ర‌ణ్‌కు జోడీగా కాకుండా క‌థ‌ను మ‌లుపుతిప్పే ఓ కీల‌క పాత్ర‌లో ఆమె క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. చ‌ర‌ణ్‌తో స‌మానంగా న‌య‌న‌తార పాత్ర తాలూకు స్క్రీన్ టైమ్ ఉంటుంది. మెగా ప‌వ‌ర్ స్టార్‌కు జోడీగా మ‌రో యంగ్ హీరోయిన్ న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

 

Advertisement
Advertisement