త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

realme C100x | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీతో వ‌చ్చిన రియ‌ల్‌మి సి100ఎక్స్ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర త‌క్కువే..

realme C100x | మొబైల్స్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మి త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ రియ‌ల్‌మి సి100ఎక్స్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 8000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని ఇచ్చారు. ఇదే దీనికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ ఫోన్ కేవ‌లం 4జి వేరియెంట్‌లోనే అందుబాటులో ఉంది.

S

Technology | Published On Jul 16, 2026, 3.21 pm IST

realme C100x | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీతో వ‌చ్చిన రియ‌ల్‌మి సి100ఎక్స్ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర త‌క్కువే..
Advertisement

realme C100x | మొబైల్స్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మి త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ రియ‌ల్‌మి సి100ఎక్స్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 8000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని ఇచ్చారు. ఇదే దీనికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ ఫోన్ కేవ‌లం 4జి వేరియెంట్‌లోనే అందుబాటులో ఉంది. ఇందులో డిస్‌ప్లేకు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల డిస్ ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, 6.8 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. యూనిసోక్ టి7250 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 4జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. ర్యామ్‌ను వ‌ర్చువ‌ల్‌గా మ‌రో 12జీబీ వ‌ర‌కు పెంచుకునే వీలు క‌ల్పించారు. దీని వ‌ల్ల ఫోన్ ల్యాగ్ లేకుండా వేగంగా ప‌నిచేస్తుంది.

భారీ బ్యాట‌రీ..

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0తో పనిచేస్తుంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ ను ఇచ్చారు. రియల్‌మి సి100ఎక్స్ లో ప్రత్యేకంగా పల్స్ లైట్ డిజైన్ ను అందించారు. ఇది తొమ్మిది రంగులు, ఐదు కస్టమైజ్ చేయగలిగే గ్లోయింగ్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. కాల్స్, మెసేజ్‌లు, ఛార్జింగ్ సమయంలో ఈ లైట్లు డైనమిక్‌గా స్పందిస్తాయి. ఫోన్ మన్నిక కోసం ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్ ను అందించారు. కంపెనీ ప్రకారం ఈ డివైస్ మిలిటరీ-గ్రేడ్ డ్రాప్, కంప్రెషన్ టెస్టుల‌ను విజయవంతంగా పూర్తి చేసింది. రెండు మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షల్లో చూపించిందని తెలిపింది. ఈ ఫోన్‌లో 8000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న‌ బ్యాటరీని అందించారు. దీనికి 45వాట్ల సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటంతో ఇతర పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు.

ధ‌ర వివ‌రాలు..

**రియల్‌మి సి100ఎక్స్‌లో 64జీబీ స్టోరేజ్ ను ఇచ్చారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. డ్యూయల్ నానో సిమ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5ఎంఎం ఆడియో జాక్, అల్ట్రా లీనియర్ బాటమ్-పోర్టెడ్ స్పీకర్, డ్యూయల్ 4జీ వోల్టీఈ, వై-ఫై ఏసీ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్, యూఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డీప్ బ్లూ టైడ్స్, గోల్డెన్ కోస్ట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ప్ర‌స్తుతం 4జీబీ, 64జీబీ మోడ‌ల్‌లోనే అందుబాటులో ఉంది. ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్‌ను రూ.14,499కు విక్ర‌యిస్తున్నారు. దీన్ని ప్ర‌స్తుతం రియ‌ల్‌మి ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్ర‌యిస్తున్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement