త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RRB ALP Recruitment | భార‌తీయ రైల్వేలో 11,127 అసిస్టెంట్‌ లోక్‌పైల‌ట్ పోస్టులు.. సికింద్రాబాద్ జోన్‌లో ఖాళీలు?

RRB ALP Recruitment | భార‌తీయ రైల్వేలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైల‌ట్ (Assistant Loco Pilot) పోస్టుల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB ALP Recruitment) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

G

National | Published On May 16, 2026, 12.16 pm IST

RRB ALP Recruitment | భార‌తీయ రైల్వేలో 11,127 అసిస్టెంట్‌ లోక్‌పైల‌ట్ పోస్టులు.. సికింద్రాబాద్ జోన్‌లో ఖాళీలు?
Advertisement

RRB ALP Recruitment | భార‌తీయ రైల్వేలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైల‌ట్ (Assistant Loco Pilot) పోస్టుల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB ALP Recruitment) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 11,127 పోస్టుల‌కు డిప్లొమా, ఐటీఐ, బీఈ లేదా బీటెక్ అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ది. ఆస‌క్తిక‌లిగిన వారు జూన్ 15 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. సికింద్రాబాద్ జోన్‌లో 1420 పోస్టులు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 11,127
ఇందులో జ‌న‌ర‌ల్ 4860 పోస్టులు, ఎస్సీ 1746, ఎస్టీ 919, ఓబీసీ 2598, ఈడ‌బ్ల్యూఎస్ 1004 చొప్పున ఉన్నాయి.

జోన్ వారీగా పోస్టులు

  • సికింద్రాబాద్ జోన్‌- 1420
  • అహ్మ‌దాబాద్ జోన్‌- 147
  • అజ్మేర్‌- 718
  • ముంబై- 1193
  • భువ‌నేశ్వ‌ర్‌- 801
  • గువాహ‌టి- 676
  • రాంచీ- 1300
  • సికింద్రాబాద్ జోన్‌లో 1420 పోస్టులు ఉన్నాయి. వాటిలో జ‌న‌ర‌ల్ 625, ఎస్సీ 209, ఎస్టీ 102, ఓబీసీ 390, ఈడ‌బ్ల్యూఎస్ 94 చొప్పున ఉన్నాయి.

అర్హ‌త‌లు

మెట్రిక్యులేష‌న్‌తోపాటు ఐటీఐలో ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, మెకానిక్ (రేడియో, టీవీ), ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, మోటార్ మెకానిక్, వైర్‌మ్యాన్‌, ట్రాక్ట‌ర్ మెకానిక్‌, ఆర్మ‌చుర్ అండ్ కాయిల్ వైండ‌ర్‌, డీజిల్ మెకానిక్‌, హీట్ ఇంజిన్‌, ట‌ర్న‌ర్‌, మెషినిస్ట్‌, రిఫ్రిజిరేష‌న్ అండ్ ఎయిర్ కండిష‌నింగ్ మెకానిక్ ట్రేడ్ చేసి ఉండాలి.

మెట్రిక్యులేష‌న్‌తో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌లో మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.

వ‌య‌స్సు: జూన్ 1 నాటికి 18 నుంచి 30 ఎండ్ల మ‌ధ్య వ‌య‌స్కులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థుల‌కు వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక ప్ర‌క్రియ‌

రాత‌ప‌రీక్ష‌, ఆప్టిట్యూడ్ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, మెడిక‌ల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

  • రాత‌ప‌రీక్ష రెండు ద‌శ‌ల్లో ఉంటుంది. మొద‌టి ద‌శ‌లో 75 మార్కుల‌కు కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. గంట‌లో పూర్తిచేయాలి. 75 ప్ర‌శ్న‌లు అండుగుతారు. ప్ర‌తి త‌ప్పు స‌మ‌ధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు. మ్యాథ‌మెటిక్స్‌, రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ సైన్స్ నుంచి ప‌దో త‌ర‌గ‌తి స్థాయిలో ప్ర‌శ్న‌లు అండుగుతారు.
  • రెండో ద‌శ‌లో రెండు పేప‌ర్లు ఉంటాయి. పార్ట్‌-1లో 100 ప్ర‌శ్న‌లు వంద మార్కుల‌కు అడుగుతారు. 90 నిమిషాల్లో ప‌రీక్ష పూర్తిచేయాలి. పార్ట్‌-2లో 75 ప్ర‌శ్న‌లు అడుగుతారు. గంట‌లో పూర్తిచేయాలి.

అప్లికేష‌న్ విధానం: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌లు, ట్రాన్స్‌జండ‌ర్లు, ఈబీసీ, మైనార్టీ అభ్య‌ర్థుల‌కు రూ.250.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జూన్ 15
వెబ్‌సైట్‌: జోన్ వారీగా ప్ర‌త్యేక వెబ్‌సైట్ ఉంటుంది.
సికింద్రాబాద్ జోన్‌: www.rrbsecunderabad.gov.in

జోన్ వారీగా

Advertisement
Advertisement