Anand Mahindra | వృద్ధ కళాకారుడికి అండగా నిలిచి.. ఔదార్యత చాటుకున్న ఆనంద్ మహీంద్రా
Anand Mahindra | ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మరోసారి తన ఔదార్యత చాటుకున్నారు. కోల్‌కతా వీధుల్లో (Kolkata streets) బతుకుపోరాటం సాగిస్తున్న ఓ వృద్ధ కళాకారుడికి అండగా నిలిచారు.
Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తరచూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటానే అప్పుడప్పుడు మోటివేషన్ అంటూ మంచి వీడియోలు షేర్ చేస్తుంటారు. అంతేకాదు, అసాధారణ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మహీంద్ర (Anand Mahindra) మరోసారి తన ఔదార్యత చాటుకున్నారు. కోల్‌కతా వీధుల్లో (Kolkata streets) బతుకుపోరాటం సాగిస్తున్న ఓ వృద్ధ కళాకారుడికి అండగా నిలిచారు.
భగవాన్ మల్లిక్ (Bhagwan Mallick) యుక్తవయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. చిన్న తనంలో తన తండ్రి నుంచి నేర్చుకున్న సంగీతమే ఇప్పుడు అతడికి బతుకుదెరువైంది. ప్రస్తుతం అతడి వయసు 80 ఏళ్లు. ఈ వయసులో కూడా కంటి చూపు మందగించినా పాతబడిపోయిన వయోలిన్‌తో తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మల్లిక్ ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య కోల్‌కతాలోని న్యూటౌన్ బస్ స్టాండ్, డీఎల్‌ఎఫ్ సబ్‌వే, న్యూ టౌన్ ఆర్ట్ స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో వయోలిన్ వాయిస్తూ రోజుకు కేవలం రూ.100 మాత్రమే సంపాదిస్తున్నాడు. ఆయనకు తోడుగా భార్య కూడా పక్కనే కూర్చుంటోంది. ఈ దంపతులు అద్దె ఇంట్లో ఉంటూ.. చాలీ చాలని సంపాదనతో బతుకును నెట్టుకొస్తున్నారు.
ఈ వృద్ధ దంపతుల పరిస్థితి తెలిసి చలించిపోయిన కంటెంట్ క్రియేటర్ ఆరాధనా ఛటర్జీ (Aradhana Chatterjee) వారి దుస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేయడంతో ఈ కథనం వెలుగులోకి వచ్చింది. మల్లిక్‌కు సంబంధించిన వీడియోని ఛటర్జీ మే నెలలో షేర్ చేశారు. ఏదైనా ఈవెంట్, సమావేశాలు నిర్వహించే వారు ప్రదర్శన కోసం మల్లిక్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ అవకాశం ఆయనకు ఎంతో సాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత జూన్ 1న మల్లిక్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. తాను మల్లిక్‌కు కొత్త వయోలిన్ బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. అంతేకాదు, ఆ దంపతుల కోసం రూ.లక్ష విరాళం సేకరించినట్లు తెలిపారు. ఆమె చేసిన పోస్టును నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇలా అదికాస్తా ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరింది.
దీనిపై ఆనంద్ మహీంద్రా సానుకూలంగా స్పందించారు. "ఆ దంపతులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన సంగీతంపై ఉన్న అభిరుచి నన్ను కదిలించింది. నేను కూడా నా వంతు సాయం చేయాలనుకుంటున్నాను" అని మహీంద్ర ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే, సాయం చేసేందుకు ఆ వృద్ధ దంపతుల వివరాలు లేవని పేర్కొన్నారు. మహీంద్రా చేసిన ఈ పోస్టుకు స్పందించిన కొందరు నెటిజన్లు మల్లిక్ వివరాలను పంచుకున్నారు.
I’d like to contribute, along with many others, who I know will be moved by his passion…
The video didn’t seem to provide details of how & where. https://t.co/hAkvZDbWev
— anand mahindra (@anandmahindra) June 24, 2026
సంబంధిత వార్తలు

Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
సెప్టెంబర్ 13, 2026

AIIMS Delhi Population Counter | క్షణక్షణం.. లైవ్‌లో దేశ జనాభా.. రోడ్డుపై డిజిటల్ బోర్డు ఏర్పాటు
సెప్టెంబర్ 7, 2026

Chenab River Doda Suicide | తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ.. ‘బై బై నాన్న’ అంటూ నదిలోకి దూకేసిన 20 ఏళ్ల యువతి
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు
- ●CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్
- ●RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?
- ●TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!
- ●Rashmika Mandanna | ఆనంద్ దేవరకొండ ఎపిక్‌కు రష్మిక మందన్న రివ్యూ - కన్నీళ్లు పెట్టుకున్నా విజయ్ దేవరకొండ
- ●iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!

NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు

CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్

RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?

TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!



