Amit Shah | మహిళా సీఎంగా ఇలాంటి సలహా ఇచ్చినందుకు సిగ్గుపడాలి.. మమతా బెనర్జీపై అమిత్ షా ఫైర్
Amit Shah | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Amit Shah | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో (Womens Safety in West Bengal) టీఎంసీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. బీర్భూమ్ జిల్లా మయూరేశ్వర్‌లోని పల్లిలో జరిగిన బహిరంగ సభలో షా ప్రసంగించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్‌జీకార్ మెడికల్ కళాశాలలో వైద్యురాలిపై అత్యాచార ఘటన తర్వాత రాష్ట్రంలోని మహిళలు రాత్రి 7 గంటల తర్వాత బయటకు రావొద్దంటూ దీదీ చేసిన వ్యాఖ్యలను షా తీవ్రంగా తప్పుబట్టారు. ఓ మహిళా సీఎంగా మహిళలకు ఇలాంటి సలహా ఇచ్చినందుకు మమతా సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. "మహిళలు రాత్రి 7 గంటల తర్వాత బయటకు రావొద్దని మమతా దీదీ అంటున్నారు. ఇలాంటి సలహా ఇచ్చినందుకు సీఎం సిగ్గుపడాలి. ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా బెంగాల్ సోదరీమణులను రక్షించలేకపోయారు" అని షా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే చిన్నారి బాలిక కూడా అర్ధరాత్రి 1 గంటకు స్కూటర్‌పై ప్రయాణించే సురక్షిత పరిస్థితి బంగాల్‌లో వస్తుందన్నారు. సందేశ్ ఖాలి, ఆర్‌జీకార్, దుర్గాపూర్ లా కాలేజ్ (దక్షిణ కోల్‌కతా లా కాలేజ్) తరహా పైశాచిక ఘటనలు ఇక జరగవని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు.
Also Read..
అలా చేస్తే దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది : రేవంత్ రెడ్డి
మహిళా రిజర్వేషన్ల బిల్లు కంటే.. ‘డీలిమిటేషన్’ అంశమే కీలకం : సోనియా గాంధీ
ఇన్‌కమ్ ట్యాక్స్ ఫామ్ 95, 96లలో ఎవరు దేన్ని ఉపయోగించాలి..?
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






