త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Form 95, 96 | ఇన్‌క‌మ్‌ ట్యాక్స్ ఫామ్ 95, 96ల‌లో ఎవ‌రు దేన్ని ఉప‌యోగించాలి..?

Form 95, 96 | ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పాత ఫామ్‌ 49AAను తొలగించి, రెండు కొత్త ఫామ్‌లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. నాన్-రెసిడెంట్స్ కోసం పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) అలాట్‌మెంట్ అప్లికేషన్ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఈ మార్పును ప్ర‌వేశ‌పెట్టింది.

S

Business | Published On Apr 13, 2026, 3.38 pm IST

Form 95, 96 | ఇన్‌క‌మ్‌ ట్యాక్స్ ఫామ్ 95, 96ల‌లో ఎవ‌రు దేన్ని ఉప‌యోగించాలి..?
Advertisement

Form 95, 96 | ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పాత ఫామ్‌ 49AAను తొలగించి, రెండు కొత్త ఫామ్‌లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. నాన్-రెసిడెంట్స్ కోసం పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) అలాట్‌మెంట్ అప్లికేషన్ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఈ మార్పును ప్ర‌వేశ‌పెట్టింది. PAN అనేది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేసే ప్రత్యేకమైన 10 అక్షరాల ఐడీ, ఇది ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. పాన్ అలాట్‌మెంట్ అప్లికేషన్ కోసం ఫామ్‌ 49AAను ఇంత‌కు ముందు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు ఇన్‌కమ్-ట్యాక్స్ యాక్ట్, 2025 ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫామ్‌లను ఉపయోగించవచ్చు. ట్యాక్స్ ఫామ్‌లను సరళీకరించడం, ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ మార్పును ప్ర‌వేశ‌పెట్టింది.

49AAకు బ‌దులుగా 95, 96..

ఫామ్‌ 49AAను ఇప్పుడు తొలగించి, కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమాల ప్రకారం రెండు వేర్వేరు ఫామ్‌లుగా విభజించారు. ఇకపై భారత‌ పౌరులు కాని వ్యక్తులు పాన్ కోసం అప్లై చేయడానికి ఫామ్‌ 95ను ఉపయోగించాలి. అలాగే భారత్ వెలుపల స్థాపించిన సంస్థలు లేదా విదేశాల్లో ఏర్పడిన అన్ ఇన్‌కార్పొరేటెడ్ ఎంటిటీలకు ఫామ్‌ 96 వర్తిస్తుంది. ఈ మార్పు విదేశీ అభ్యర్థులకు స్పష్టతను పెంచి, కాంప్లయన్స్ ప్రక్రియను సులభతరం చేస్తుందని తెలిపింది. ఇప్పటి నుంచి పాత ఫామ్‌ 49AA కొత్త విధానంలో వర్తించదు.

సుల‌భ‌త‌రంగా అప్లికేష‌న్ ప్రాసెస్..

పన్నుల చట్టాలను సరళీకరించడానికి ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త ఫామ్‌ల‌ను మరింత సక్రమంగా రూపొందించారు. అవసరమైన వివరాలనే ఇవి కలిగి ఉంటాయి. ముఖ్యమైన కొత్త అంశాల్లో ఒకటి రెసిడెన్షియల్ స్టేటస్ క్లాసిఫికేషన్, ఇది అప్లికెంట్ పౌరసత్వ స్థితిని సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. కొత్త ఫామ్‌లలో కమ్యూనికేషన్ అడ్ర‌స్ ఎంపికలో కూడా ఎక్కువ సౌలభ్యం ఇచ్చారు. ఇప్పుడు అప్లికెంట్లు తమ నివాసం, ఆఫీస్ లేదా ప్రతినిధి అస్సెస్సీ అడ్ర‌స్‌లలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు. తప్పనిసరి కాంటాక్ట్ వివరాలను చేర్చే అవకాశం కమ్యూనికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫామ్‌లను నింపడానికి అవసరమైన పత్రాల జాబితాను కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డించింది. వాటిలో ఐడెంటిటీ ప్రూఫ్, అడ్ర‌స్ ప్రూఫ్, బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌, సంస్థల విష‌యంలో ఫౌండేష‌న్ తేదీ స‌ర్టిఫికెట్‌, రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్ వంటివి ఉన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement