త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | అలా చేస్తే ద‌క్షిణాది, చిన్న రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంది : రేవంత్ రెడ్డి

Revanth Reddy | లోక్‌సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు (womens quota)వేర్వేరు అంశాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.

D

Telangana | Published On Apr 13, 2026, 3.39 pm IST

Revanth Reddy | అలా చేస్తే ద‌క్షిణాది, చిన్న రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంది : రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy | లోక్‌సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు (womens quota)వేర్వేరు అంశాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ విష‌యం ప్ర‌తీ పౌరుడికీ తెలుస‌న్నారు. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ స్థానాల్లో మ‌హిళా కోటాను వెంట‌నే అమ‌లు చేస్తే.. దేశ‌మంతా స్వాగ‌తిస్తుంద‌ని చెప్పారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌ను ఒక సాకుగా చూపుతూ జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచాల‌ని బీజేపీ యత్నిస్తోందని రేవంత్ ఆరోపించారు. ఇది ఆ పార్టీకి ప్ర‌యోజ‌నం చేకూర‌వ‌చ్చ‌ని.. కానీ అలా చేస్తే ద‌క్షిణాది, చిన్న రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు, ఇది భ‌విష్య‌త్తులో మ‌న దేశాన్ని బ‌ల‌హీనం చేస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఏ పార్టీకైనా జాతీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్యంగా ఉండాల‌ని వ్యాఖ్యానించారు. ఈ సున్నితమైన అంశంపై అన్యాయ‌మైన రీతిలో కాకుండా.. అన్ని పార్టీలతో చ‌ర్చించి జాతీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

Also Read..

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు కంటే.. ‘డీలిమిటేషన్’ అంశమే కీల‌కం : సోనియా గాంధీ

మ‌హిళ‌ల‌తోనే ప్ర‌జాస్వామ్యం మ‌రింత బ‌లోపేతం : ప్ర‌ధాని మోదీ

విద్యుత్ ఆర్టిజ‌న్ల డిమాండ్లు ప‌రిష్క‌రించండి: సీఎంకు నెల్లికంటి సత్యం లేఖ‌

Advertisement
Advertisement