త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | తెలంగాణ‌లో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైద‌రాబాద్‌లోనే అత్య‌ధికం..

Telangana | రాష్ట్రంలో (Telangana) స‌ర్ (SIR) ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఓటర్ల జాబితా నుండి 73,39,235 ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వెల్లడించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన మొత్తం ఓట్లలో ఒక్క హైదరాబాద్ (Hyderabad) జిల్లాలోనే అత్యధికంగా 19,41,444 ఓట్లు ఉన్నాయి.

G

Telangana | Published On Aug 25, 2026, 10.05 am IST

Telangana | తెలంగాణ‌లో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైద‌రాబాద్‌లోనే అత్య‌ధికం..
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో (Telangana) స‌ర్ (SIR) ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఓటర్ల జాబితా నుండి 73,39,235 ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వెల్లడించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన మొత్తం ఓట్లలో ఒక్క హైదరాబాద్ (Hyderabad) జిల్లాలోనే అత్యధికంగా 19,41,444 ఓట్లు ఉన్నాయి. ఆ త‌ర్వాతి స్థానాల్లో రంగారెడ్డి జిల్లాలో 12,87,091 ఓట్లు, మేడ్చ‌ల్ జిల్లాలో 10,71,566 ఓట్లు (Voters Deleted) తొల‌గించారు. అతి త‌క్కువ‌గా యాదాద్రి జిల్లాల్లో 26,121 ఓట్లు మాత్రమే తొలగించారు.

రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 10 నాటికి 3,38,26,448 ఓటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితాలో ఆ సంఖ్య 2,64,87,213కి తగ్గింది. అంటే మొత్తం ఓటర్ల జాబితాలో 21.70 శాతం తగ్గుదల నమోదైంది. శాశ్వతంగా మ‌రో ప్రాంతానికి తరలివెళ్లడం కార‌ణంగా ఎక్కువ పేర్లు తొలగించారు. దీనివల్ల 45,18,963 ఓటర్ల పేర్లు తొల‌గించ‌బ‌డ్డాయి. ఇతర కారణాలలో అడ్ర‌స్ లేనివారు లేదా అందుబాటులో లేక‌పోవ‌డంతో 11,25,546 పేర్లు, మరణాల కారణంగా 9,22,229 పేర్లను తొల‌గించారు. ఇప్పటికే ఇతర నియోజకవర్గాల్లో నమోదై ఉండటంతో 6,70,203 మంది ఓటర్ల పేర్లు, ఇత‌ర కార‌ణాల‌తో 1,02,294 పేర్లు తొలగించారు.

హైద‌రాబాద్‌లో అత్య‌ధికం..

అత్య‌ధికంగా హైద‌రాబాద్‌లో 19.41 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించారు. ఇందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,79,510 ఓట్లు ఉండ‌గా, యాకుత్‌పురాలో 1,54,982 ఓట్లు తొలగించారు. అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 94,174 ఓట్లు డిలీట్ అయ్యాయి. శాతాల వారీగా చూస్తే ముషీరాబాద్‌లో అత్యధికంగా 45.17 శాతం, మలక్‌పేటలో 44.76 శాతం ఓట్లు తొలగిపోగా, బహదూర్‌పురాలో అత్యల్పంగా 34.57 శాతం తొలగింపు నమోదైంది.

జిల్లాల వారీగా..

కుమరం భీమ్ ఆసిఫాబాద్- 48,139
మంచిర్యాల- 1,14,468
ఆదిలాబాద్- 63,159
నిర్మల్- 1,13,170
నిజామాబాద్- 2,11,670
కామారెడ్డి- 84,268
జగిత్యాల- 74,738
పెద్దపల్లి- 81,139
కరీంనగర్- 1,77,102
రాజన్న సిరిసిల్ల- 58,567
సంగారెడ్డి- 2,98,278
మెదక్- 42,936
సిద్దిపేట- 1,18,786
రంగారెడ్డి- 12,87,091
వికారాబాద్- 2,10,297
మేడ్చల్ మల్కాజ్‌గిరి- 10,71,566
హైదరాబాద్- 19,41,444
మహబూబ్‌నగర్- 1,03,086
నాగర్‌కర్నూల్- 1,13,040
వనపర్తి- 38,564
జోగులాంబ గద్వాల‌- 63,925
నల్ల‌గొండ- 1,58,635
సూర్యాపేట- 96,307
యాదాద్రి భువనగిరి- 26,121
జనగామ- 63,891
మహబూబాబాద్- 47,979
వరంగల్- 98,413
హనుమకొండ- 1,01,697
జయశంకర్ భూపాలపల్లి- 35,918
భద్రాద్రి కొత్తగూడెం- 1,32,785
ఖమ్మం- 1,57,854
ములుగు- 27,842
నారాయణపేట- 76,360

హైద‌రాబాద్ జిల్లాలో..

ముషీరాబాద్‌- 1,40,070
మ‌ల‌క్‌పేట‌- 1,47,799
అంబ‌ర్‌పేట‌- 1.20.303
ఖైర‌తాబాద్‌- 1,23,472
జూబ్లీహిల్స్‌- 1,79,510
స‌న‌త్‌న‌గ‌ర్‌- 1,14,131
నాంప‌ల్లి- 1,37,126
కార్వాన్‌- 1,41,766
గోషామ‌హ‌ల్‌- 1,10,148
చార్మినార్‌- 94,174
చాంద్రాయ‌ణ‌గుట్ట‌- 1,48,869
యాకుత్‌పుర‌- 1,54,982
బ‌హ‌దూర్‌పుర‌- 1,21,350
సికింద్రాబాద్‌- 1,02,710
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌- 1,05,034

తొలగించిన ఓటర్ల వివరాల జాబితాను తెలంగాణ సీఈఓ (CEO) అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ప్రస్తుతం అభ్యంతరాలు, క్లెయిమ్‌ల (Claims and objections) సమయం న‌డుస్తున్న‌ది. పొరపాటున ఓటు కోల్పోయిన అర్హులైన పౌరులు 'ఫారమ్ 6' (FORM 6) సమర్పించి తమ ఓటును తిరిగి నమోదు చేసుకోవచ్చు.

Advertisement
Advertisement