Sheikh Abubakr Ahmad | మహిళలు.. పెట్టెలో దాచుకునే బంగారు నెక్లెస్ లాంటివారు.. వారిని ఇంటికే పరిమితం చేయాలి: కేరళ మతగురువు అబూబకర్
Sheikh Abubakr Ahmad | మహిళలు (Women) ఇంటికే పరిమితం కావాలని, వారు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదంటూ కేరళ గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ (Sheikh Abubakr Ahmad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు బంగారు పెట్టెలో భద్రంగా దాచుకోవాల్సిన బంగారు నెక్లెస్ లాంటివారని చెప్పారు.
Sheikh Abubakr Ahmad | త్రినేత్ర.న్యూస్: మహిళలు (Women) ఇంటికే పరిమితం కావాలని, వారు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదంటూ కేరళ గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ (Sheikh Abubakr Ahmad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు బంగారు పెట్టెలో భద్రంగా దాచుకోవాల్సిన బంగారు నెక్లెస్ లాంటివారని చెప్పారు. రోడ్డు పక్కన పడేసే రుబ్బుడు రాళ్లలా బహిరంగంగా తిరగనిస్తే వారి గౌరవం, విలువ దెబ్బతింటాయని పేర్కొన్నారు. కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అబూబకర్.. మహిళ గౌరవాన్ని కాపాడేందుకు పర్దా పద్ధతిని ఇస్లాం (Islam) సూచించిందన్నారు. వారు యటకు రావడం వల్ల భారీ వినాశనం జరుగుతుందని చెప్పారు.
మహిళ రక్షణ, గౌరవం కోసమే ఇస్లాం పర్ధా పద్ధతిని (Purdah System), ఆంక్షలను విధించిందని చెప్పారు. పవిత్ర ఖురాన్ కూడా అలాగే చెబుతున్నదని వెల్లడించారు. ఇది మహిళలను తక్కువ చేయడానికి ఉద్దేశించినది కాదని, వారిని గౌరవించడానికి, రక్షించడానికి ఉద్దేశించిందని చెప్పారు. బంగారు నెక్లెస్‌ను (Gold Necklace) రోడ్డు పక్కన వదిలేస్తే.. దారివెంట వెళ్లే ప్రతి ఒక్కరూ దానిని తాకుతారని, అది చివరకు దాని అందాన్ని, విలువను కోల్పోతుందన్నారు. నెక్లెస్ తన అందాన్ని నిలుపుకోవాలంటే, దానిని పెట్టెలో సురక్షితంగా ఉంచాలంటూ వివరించారు. మత పెద్దలు, ముఖ్యంగా సమస్త కేరళ జమియ్యతుల్ ఉలమా, గత వందేండ్లుగా ఈ విధానాన్ని బోధిస్తున్నారని గుర్తుచేశారు. దీనివల్లే దేశంలోని మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకోగలిగారని వ్యాఖ్యానించారు.
మహిళలకు ఇస్లాం ఉన్నత స్థానాన్ని ఇచ్చింది, ఆడశిశువుల హత్యలను నిషేధించడంతోపాటు వారికి ఆస్తి హక్కులను (Property Rights) కూడా కల్పించిందన్నారు. మహిళలు బహిరంగ ప్రదేశాలోకి రాకుండా విధించిన ఆంక్షలను కూడా వారి పట్ల చూపే గౌరవంగానే భావించాలని పిలుపునిచ్చారు. మతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినందువల్ల తమ సమాజానికి ఇలాంటి విషయాలు చెప్పే పూర్తి అధికారం, బాధ్యత తమకు ఉన్నాయన్నారు. దీనిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Asaduddin Owaisi | ఇస్లాంలో ఏది అవసరమో.. ఏది కాదో నిర్ణయించడానికి మీరెవరు?: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ఆగస్టు 26, 2026

Hijab | ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 25, 2026

Suicide | హైదరాబాద్లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



