Indians | 2025లో భారతీయులు ఎక్కువగా వెళ్లిన దేశాలు ఇవే.. టాప్ 3లో ఉన్నవి ఏవి అంటే..?
Indians | ఇటీవలి కాలంలో భారతీయులు విదేశీ ప్రయాణాలపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. పెరుగుతున్న ఆదాయాలు, మెరుగైన విమాన కనెక్టివిటీ, అంతర్జాతీయ సెలవులపై ఆసక్తి పెరగడం వంటి వివిధ కారణాల వల్ల అధిక శాతం మంది భారతీయులు విదేశాలకు టూర్లు వేస్తున్నారు.
Indians | ఇటీవలి కాలంలో భారతీయులు విదేశీ ప్రయాణాలపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. పెరుగుతున్న ఆదాయాలు, మెరుగైన విమాన కనెక్టివిటీ, అంతర్జాతీయ సెలవులపై ఆసక్తి పెరగడం వంటి వివిధ కారణాల వల్ల అధిక శాతం మంది భారతీయులు విదేశాలకు టూర్లు వేస్తున్నారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025లో ఏయే దేశాలకు భారతీయులు ఎక్కువగా టూర్లు వేశారో వెల్లడైంది. ఆ జాబితాలో యూఏఈ మొదటి స్థానంలో ఉండగా, గతేడాదిలో 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు ప్రయాణించినట్లు తేలింది. 2024లో ఈ సంఖ్య 3.08 కోట్లు ఉండగా, ఈ ఏడాదిలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ ప్రయాణం ఇప్పుడు అనేక కుటుంబాలు, ఉద్యోగ వర్గాలకు ప్రాధాన్యతగా మారిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
యూఏఈ మొదటి స్థానంలో..
2025లో భారతీయుల మొత్తం విదేశీ ప్రయాణాల్లో 26.3 శాతం వాటాతో యూఏఈ మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌కు అత్యంత సమీపంలో ఉండడం, తక్కువ ఖర్చు, సులభంగా ప్రయాణించడం, దుబాయ్, అబుధాబి వంటి నగరాలకు తరచూ విమాన సర్వీసులు అందుబాటులో ఉండడం, షాపింగ్ ఫెస్టివల్స్, ఆధునిక ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు, థీమ్ పార్కులు, లగ్జరీ వసతులు వంటి కారణాల వల్ల చాలా మంది భారతీయులు తమ మొదటి గమ్యస్థానంగా యూఏఈని ఎంచుకుంటున్నట్లు వెల్లడైంది. అలాగే ఈ జాబితాలో సౌదీ అరేబియా రెండో స్థానంలో నిలిచింది. 2025లో మొత్తం విదేశీ ప్రయాణాల్లో 10.3 శాతం వాటాతో ఈ దేశం ద్వితీయ స్థానాన్ని పొందింది. సౌదీలో ఉమ్రా, ఇతర యాత్రల కోసం ముఖ్య కేంద్రం ఉండడం, పెద్ద సంఖ్యలో భారతీయులు నివాసం ఉండడం, కుటుంబ, ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు, భారత్‌తో ఉన్న సాంస్కృతిక, చారిత్రక బంధాలు వంటి కారణాల వల్ల భారతీయులు సౌదీకి వెళ్తున్నారు.
థాయ్ లాండ్‌ది మూడో స్థానం..
2025లో 6.8 శాతం భారతీయ ప్రయాణికులతో థాయ్ లాండ్ మూడో స్థానంలో నిలవగా, తక్కువ ఖర్చును కలిగి ఉండడం, సెలవులకు అనువైన ప్రదేశం కావడం, ప్రసిద్ధ బీచ్‌లు, స్ట్రీట్ మార్కెట్లు, ఉత్సాహభరితమైన నైట్ లైఫ్, తక్కువ విమాన ప్రయాణ సమయం, చార్జిలు, భిన్న ఆహారాలు, డ్రింక్స్, షాపింగ్ వంటి కారణాల వల్ల భారతీయులు థాయ్‌లాండ్‌కు కూడా అధికంగా వెళ్తున్నారు. ఇక ఇవే కాకుండా 2025లో భారతీయులు ఎక్కువగా వెళ్లిన విదేశాల్లో వరుసగా సింగపూర్, యూఎస్ఏ, యూకే, మలేషియా, ఖతార్, కువైట్, ఒమాన్, కెనడా, ఆస్ట్రేలియా, వియత్నాం, శ్రీలంక, జర్మనీ, బహ్రెయిన్, జపాన్, ఫ్రాన్స్, రష్యాలు నిలిచాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Russian army | రష్యా సైన్యం నుంచి 140 మంది భారతీయులకు విముక్తి.. ఆ 55 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు
అక్టోబర్ 3, 2026

Flydubai Flight | హైజాక్ కోడ్.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!
సెప్టెంబర్ 30, 2026

Harish Rao | సచివాలయం నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు: హరీశ్‌రావు
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Vijayasai Reddy | 8న మరో ఐదు ప్రతిపాదనలు.. కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక అప్డేట్
- ●KTR | ఫేక్ గాంధీ.. మీకు నచ్చినన్ని కేసులు పెట్టుకోండి : కేటీఆర్
- ●Stock Markets | మార్కెట్లకు గ్లోబల్ బూస్ట్.. నిఫ్టీ 22,600 పైన..
- ●RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
- ●Manne Krishank | సమాధానం చెప్పాల్సింది పోయి.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా..?
- ●Nigeria military aircraft | కుప్పకూలిన మిలిటరీ విమానం.. 32 మంది మృతి

Vijayasai Reddy | 8న మరో ఐదు ప్రతిపాదనలు.. కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక అప్డేట్

KTR | ఫేక్ గాంధీ.. మీకు నచ్చినన్ని కేసులు పెట్టుకోండి : కేటీఆర్

Stock Markets | మార్కెట్లకు గ్లోబల్ బూస్ట్.. నిఫ్టీ 22,600 పైన..

RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం



