త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thailand school shooting | స్కూల్‌లోకి చొరబడి విద్యార్థులపై దుండగుడి కాల్పులు

థాయిలాండ్‌లో గన్ కల్చర్ అనేది కొత్తేమీ కాదు. గన్ పట్టుకొని నడి రోడ్డు మీద తిరగడం అక్కడ చాలా కామన్. 2022లోనూ ఓ మాజీ పోలీస్ ఆఫీసర్ ఓ నర్సరీ స్కూల్‌లోకి చొరబడి 36 మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే.

J

International | Published On Feb 11, 2026, 6.08 pm IST

Thailand school shooting | స్కూల్‌లోకి చొరబడి విద్యార్థులపై దుండగుడి కాల్పులు
Advertisement

Thailand school shooting | థాయిలాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ స్కూల్‌లోకి చొరబడిన దుండగుడు స్కూల్‌లోని విద్యార్థులు, టీచర్లను గన్‌తో బెదిరించి బందీ చేసుకున్నాడు. ఆ తర్వాత విద్యార్థులు, టీచర్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన హాత్ యాయ్ జిల్లాలోని ఓ స్కూల్‌లో బుధవారం చోటు చేసుకుంది. జిల్లాలోని సొంగ్‌ఖ్లా ప్రావిన్స్‌లో ఉన్న పతోంగ్‌ప్రతాన్‌కిరివాట్ స్కూల్‌లోకి 18 ఏళ్ల వ్యక్తి చొరబడి బీభత్సం సృష్టించాడు. గన్‌తో స్కూల్‌లోని టీచర్లు, విద్యార్థులను బెదిరించి వారిని బందీ చేశాడు. ఆ తర్వాత వాళ్లపై కాల్పులు జరపడంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దుండగుడి గురించి తెలియగానే స్కూల్‌లోని విద్యార్థులు భయంతో బయటికి పరుగులు తీశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ దుండగుడిని అదుపులోకి తీసుకొని అతడి వద్ద బందీగా ఉన్న విద్యార్థులు, టీచర్ల ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన థాయిలాండ్‌ని ఉలిక్కిపడేలా చేసింది. నిజానికి థాయిలాండ్‌లో గన్ కల్చర్ అనేది కొత్తేమీ కాదు. గన్ పట్టుకొని నడి రోడ్డు మీద తిరగడం అక్కడ చాలా కామన్. 2022లోనూ ఓ మాజీ పోలీస్ ఆఫీసర్ ఓ నర్సరీ స్కూల్‌లోకి చొరబడి 36 మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement