Air India | ఇరాన్‌పై దాడులు.. వెనక్కి తిరిగొచ్చిన ఢిల్లీ-టెల్ అవీవ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్
Air India | అమెరికా సహకారంతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ పట్టపగలే భీకర దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి (shuts airspace).
Air India | అమెరికా సహకారంతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ పట్టపగలే భీకర దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. రాజధాని టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో టెహ్రాన్‌లో భారీగా పొగలు ఎగసిపడ్డాయి. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి (shuts airspace). దీంతో భారత్ నుంచి పశ్చిమాసియా వెళ్లే విమానరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తాజాగా ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం మార్గం మధ్యలో నుంచి వెనక్కి తిరిగి వచ్చేసింది. ఎయిర్ ఇండియా (Air India)తోపాటూ ఇండిగో సైతం పలు విమానాలను రద్దు చేసింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
మరోవైపు ఈ దాడులకు ఇరాన్‌సైతం ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, బెహ్‌రెయిన్, యూఏఈ, ఖతార్, కువైట్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని అంతా భయపడుతున్నారు. మరోవైపు మూడో ప్రంచ యుద్ధం రాబోతోందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అక్కడి పరిస్థితులను ప్రపంచం మొత్తం నిశితంగా గమనిస్తోంది.
Also Read..
Donald Trump | ఆయుధాలు వీడకుంటే మరణమే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
India releases advisory for citizens | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. పౌరులకు భారత్ కీలక అడ్వైజరీ
మానసిక ఆరోగ్యంలో భారత యువతకు 60వ స్థానం.. వైద్య నిపుణుల హెచ్చరిక..
సంబంధిత వార్తలు

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



