Mental Health | మానసిక ఆరోగ్యంలో భారత యువతకు 60వ స్థానం.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Mental Health | భారతీయ యువత ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటోందని గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 నివేదిక వెల్లడించింది. 84 దేశాల్లో ప్రజల మానసిక ఆరోగ్యంపై చేపట్టిన సమగ్ర అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం భారత్‌లో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు మైండ్ హెల్త్ కోషెంట్ (MHQ)లో కేవలం 33 స్కోర్‌ను మాత్రమే సాధించినట్లు తేలింది.
Mental Health | భారతీయ యువత ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటోందని గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 నివేదిక వెల్లడించింది. 84 దేశాల్లో ప్రజల మానసిక ఆరోగ్యంపై చేపట్టిన సమగ్ర అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం భారత్‌లో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు మైండ్ హెల్త్ కోషెంట్ (MHQ)లో కేవలం 33 స్కోర్‌ను మాత్రమే సాధించినట్లు తేలింది. దీంతో భారతీయ యువత మానసిక ఆరోగ్యం విషయంలో ప్రపంచ జాబితాలో 60వ స్థానంలో నిలిచారు. తాత్కాలిక ఒత్తిడి లేదా దీర్ఘకాలిక వ్యాధుల కన్నా ఇది మరింత ఆందోళన కలిగించే విషయమని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక 55 ఏళ్లకు పైబడిన వారు MHQ స్కోర్ 96 సాధించి 49వ స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో తరాల మధ్య మానసిక సామర్థ్యంలో అంతరం గణనీయంగా ఉన్నట్లు స్పష్టమైంది. MHQ అనేది వ్యక్తి జీవితం, ఉద్యోగం, సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన జ్ఞాన, భావోద్వేగ, సామాజిక, శారీరక సామర్థ్యాలను కొలిచేందుకు రూపొందించబడిన సూచిక.
ఏంటీ MHQ..?
నిపుణులు చెబుతున్న ప్రకారం భారతీయ యువతలో కనిపిస్తున్న ఈ ఆందోళనకర ధోరణి కేవలం ఆందోళన లేదా డిప్రెషన్ పెరుగుదలకే పరిమితం కాలేదని చెప్పారు. ఇది భావోద్వేగ నియంత్రణ, ఏకాగ్రత, స్థైర్యం, సామాజిక అనుబంధం వంటి ప్రాథమిక మానసిక లక్షణాల్లో క్షీణతను ప్రతిబింబిస్తుందన్నారు. జీవనశైలిలో మార్పులు, చిన్నతనం నుంచే స్క్రీన్ల వినియోగం, ఆహారపు అలవాట్లు, కుటుంబ వ్యవస్థ బలహీనత వంటి అంశాలు యువతలో ఈ మార్పులకు కారణమవుతున్నాయన్నారు. కాగా మైండ్ హెల్త్ కోషెంట్ (MHQ) అనేది 47 జ్ఞాన, భావోద్వేగ, సామాజిక, శారీరక సూచికల ఆధారంగా వ్యక్తిగత సమాధానాలను సమగ్రంగా సమీకరించే సూచిక. ఇది కేవలం వైద్య నిర్దారణలకు మాత్రమే పరిమితం కాకుండా, వ్యక్తులు రోజువారి జీవితంలో ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారనే విషయాన్ని అంచనా వేస్తుంది. భావోద్వేగ నియంత్రణ, ఏకాగ్రత, సామాజిక సంబంధాలు, ఒత్తిడి నుంచి కోలుకునే సామర్థ్యం వంటి అంశాలు ఉత్పాదకత, జీవన సంతృప్తికి అత్యవసరంగా పేర్కొంటుంది.
ప్రభుత్వాలకు దృక్పథం అవసరం..
భారత్‌లో యువత MHQ (33) ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం జనాభాలో చాలా మందిలో డిప్రెషన్, ఆందోళన, ఇతర మానసిక వ్యాధులు అధికంగా ఉంటున్నాయని నేషనల్ మెంటల్ హెల్త్ సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో యువత మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలకు సరైన దృక్పథం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సపోర్టింగ్ గ్రూప్స్, అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలి, మానసిక ఆరోగ్య సేవలను విరివిగా అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. లేదంటే భవిష్యత్తులో మరింత తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026

Sara Ali Khan | ప్రేక్షకులు నిరాశకు గురైతే నాకు బాధ కలుగుతుంది : సారా అలీ ఖాన్
మే 16, 2026

Janhvi Kapoor | ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లా.. జనం నన్ను ద్వేషిస్తున్నారనిపించింది : జాన్వీ కపూర్
ఏప్రిల్ 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



