Religious Conversion | మత్తుమందు ఇచ్చి ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం.. ఆపై బలవంతంగా మతమార్పిడి
Religious Conversion | మహారాష్ట్ర నాగ్‌పూర్ (Nagpur)లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి భార్య (Air Force Officials Wife) లైంగిక వేధింపులకు గురైంది.
Religious Conversion | మహారాష్ట్ర నాగ్‌పూర్ (Nagpur)లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి భార్య (Air Force Officials Wife) లైంగిక వేధింపులకు గురైంది. ఆమెకు తన స్నేహితుడు మత్తుమందు ఇచ్చి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమెకు బలవంతంగా మతం మార్చి (Religious Conversion) వివాహం చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు.. బాధిత మహిళ భర్త భారతీయ వైమానిక దళంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతను నాగపూర్ అవతల పోస్టింగ్‌లో ఉన్నాడు. మహిళ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో ఓ ప్లాట్ కొనుగోలు చేస్తాననే నెపంతో 26 ఏళ్ల అయాజ్ తాజ్ మదారే మహిళను సంప్రదించాడు. వార్ధా రోడ్‌లోని ఒక హోటల్‌కు రమ్మని చెప్పాడు. అయితే, ఆమెకు అతడితో ముందే పరిచయం ఉండటంతో అక్కడికి వెళ్లింది. అక్కడ డ్రింక్స్ ఆర్డర్ చేసిన అయాజ్.. మహిళ తాగే పానీయంలో మత్తుమందు కలిపాడు. ఈ విషయం తెలియని బాధితురాలు అది తాగి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతేకాకుండా, ఆ దుశ్చర్యకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను కూడా రికార్డ్ చేసి ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. ఫొటోలు, వీడియోలను నీ భర్తకు పంపుతానని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ ఆమెను బెదిరించాడు. అలా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు బ్లాక్‌మెయిల్ చేసి బాధిత మహిళ నుంచి సుమారు రూ.4 లక్షలు వసూలు చేశాడు. మే 31వ తేదీన ఆమెను కల్మేశ్వర్ ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా మతమార్పిడి చేయించాడు. ఇష్టం లేకున్నా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇలా ఏడాదిగా సాగుతున్న ఈ అఘాయిత్యాన్ని బాధిత మహిళ ధైర్యం చేసి తన భర్తకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ అధికారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏవో మంత్రాలు చదివి తనను లోబరుచుకునేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో మహిళ నన్ను వదిలేయ్ అని ఎంత చెప్తున్నా వినకుండా సదరు వ్యక్తి ఏవో మంత్రాలు చదువుతూ ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. కేసు దర్యాప్తుకు ఈ వీడియో కీలక సాక్ష్యంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకూ అయాజ్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు.
Also Read..
చిన్నారులపై అఘాయిత్యం చేస్తే కాల్చి పడేయాలి
బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా - అల్లు అర్జున్ సాంగ్‌తో ప్రధాని మోదీ పోస్ట్
భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక అమెరికా ఐపీవోల్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి
- ●Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్
- ●Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు
- ●Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్
- ●TGHRC | ఆ ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు సమర్పించండి: డీజీపీకి టీజీహెచ్ఆర్సీ ఆదేశం
- ●Kayadu Lohar | నాని ప్యారడైజ్ ఈవెంట్ - కయదు మిస్సింగ్

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి

Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్

Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు

Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్






