Unable To Pay Rent | కిరాయి కట్టలేక.. రూ.37 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు ముద్రించాడు!
Unable To Pay Rent | నెలలుగా కిరాయి కట్టకపోవడంతో ఇంటి యజమాని తరచూ గొడవ పడుతున్నాడు. వేలల్లో పేరుకుపోయిన కిరాయిని (Unable To Pay Rent) చెల్లించేందుకు అతని ఓ ఉపాయం వచ్చింది. ఆ సమస్య నుంచి బయట పడేందుకు నకిలీ నోట్లు (Fake Notes) ముద్రించడం మొదలు పెట్టాడు.
Unable To Pay Rent | త్రినేత్ర న్యూస్: నెలలుగా కిరాయి కట్టకపోవడంతో ఇంటి యజమాని తరచూ గొడవ పడుతున్నాడు. వేలల్లో పేరుకుపోయిన కిరాయిని (Unable To Pay Rent) చెల్లించేందుకు అతని ఓ ఉపాయం వచ్చింది. ఆ సమస్య నుంచి బయట పడేందుకు నకిలీ నోట్లు (Fake Notes) ముద్రించడం మొదలు పెట్టాడు. అయితే కొన్ని రోజులుగా కిరాయి దారుడు గదికి రాకపోవడంతో.. ఇంటి యజమాని తాళం పగలగొట్టడంతో అసలు విషయం బయటపడింది.
పుష్పక్ కృష్ణ భండార్కర్ అలియాస్ బెందనే నాగపూర్‌లోని (Nagpur) ఖర్బీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఏడాదిన్నర క్రితం గదిని కిరాయికి తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలోనే రెంటల్ అగ్రిమెంట్ పూర్తయింది. పైగా గత కొన్ని నెలలుగా అతడు కిరాయి (Room Rent) కూడా చెల్లించడం లేదు. ఇదే విషయమై ఇంటి యజమాని రమేశ్‌కి.. పుష్పక్ మధ్య గొడవ జరుగుతున్నది. గదిని ఖాళీ చేయాలని చెప్పడంతో చంపుతానంటూ చాకుతో బెదిరించాడు. దీంతో రమేశ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా అతడు గదికి రావడం మానేశాడు. కిరాయి చెల్లించకపోగా, గదికి రాకుండా ఉంటంతో తాళం పగలకొట్టి లోపలికి వెళ్లిన రమేశ్.. షాక్‌కు గురయ్యాడు. బకెట్‌లో నోట్ల కట్టలు, గది నిండా చెల్లాచెదురుగా ఉన్న కాగితాలు, ఒక ప్రింటర్ కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన అతడు పోలీసులకు సమాచారం అందించాడు.
అక్కడికి చేరుకున్న పోలీసులు మొత్తం రూ.37 లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఒకవైపు మాత్రమే ముద్రించి, మరోవైపు ఖాళీగా ఉన్న నోట్లను, ప్రింటింగ్ మెటీరియల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 48 లక్షలుగా తేలింది. ఈ సామాగ్రిని సీజ్ చేసిన పోలీసులు.. పుష్పక్ కోసం గాలింపు ప్రారంభించారు. దర్యాప్తులో అతడు ముంబైలో (Mumbai) ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి పయణమయ్యారు.
సంబంధిత వార్తలు

Nagastra-2 | సైన్యం చేతికి నాగాస్త్ర-2.. శత్రువులకు వణుకే
అక్టోబర్ 23, 2026

Air India Flight | టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
అక్టోబర్ 23, 2026

forcibly kissing | చిన్నారులను బలవంతంగా ముద్దుపెట్టుకోవడం ప్రేమ అనిపించుకోదు.. ముంబై కోర్టు సంచలన తీర్పు
అక్టోబర్ 21, 2026
తాజావార్తలు
- ●Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వలేదని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త
- ●Revanth Reddy | రక్షణ రంగంలో భారత్‌ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్
- ●Special Trains | చర్లపల్లి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. పలు సర్వీసులు పొడిగింపు..
- ●HMDA e-Auction | కోకాపేటలో మరోసారి రికార్డు ధర.. ఎకరం రూ.120 కోట్లు!
- ●Hyderabad Metro | రాష్ట్రపతి ఉత్తర్వులకు తూట్లు.. హైదరాబాద్ మెట్రో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికేతరులు
- ●Basara IIIT | నీటి కొరత.. ఆన్లైన్ క్లాసుల బాటలో బాసర ట్రిపుల్ ఐటీ

Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వలేదని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త

Revanth Reddy | రక్షణ రంగంలో భారత్‌ను అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్

Special Trains | చర్లపల్లి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. పలు సర్వీసులు పొడిగింపు..

HMDA e-Auction | కోకాపేటలో మరోసారి రికార్డు ధర.. ఎకరం రూ.120 కోట్లు!



