Allu Arjun | బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా – అల్లు అర్జున్ సాంగ్‌తో ప్రధాని మోదీ పోస్ట్
ప్రధాని మోదీ కారణంగా అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం స్లోవేకియా పర్యటనలో ఉన్న మోదీ...ఆ దేశ అధ్యక్షుడితో దిగిన ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.ఈ ఫొటోకు బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌గా అల్లు అర్జున్ ఏఏ 23 మూవీ థీమ్ సాంగ్‌ను ఉపయోగించడం వైరల్‌గా మారింది.
Entertainment | Published On Jun 16, 2026, 3.10 pm IST
Allu Arjun | పుష్ప, పుష్ప 2 బ్లాక్‌బస్టర్స్‌తో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా తెలుగు రాష్ట్రాలతో సమానంగా నార్త్‌లో వసూళ్లను దక్కించుకుంది. 800 కోట్ల తో బాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు డబ్బింగ్ మూవీగా చరిత్రను సృష్టించింది.
ఇమిటేట్...
పుష్ప, పుష్ప 2 సినిమాల్లో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, బాడీలాంగ్వేజ్, డైలాగ్స్‌తో పాటు పాటలు సెన్సేషన్ అయ్యాయి. పలువురు క్రికెటర్లతో పాటు ఇంటర్నేషనల్ సెలిబ్రిటీలు సైతం బన్నీ మ్యానరిజమ్స్‌ను ఇమిటేట్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.
మోదీ కూడా....
తాజాగా బన్నీ ఫ్యాన్స్ లిస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా చేరిపోయారు. ప్రస్తుతం ప్రధాని మోదీ స్లోవేకియా దేశంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా స్లోవేకియా ప్రెసిడెంట్ నుంచి ఓ బహుమతిని స్వీకరిస్తున్న ఫొటోను ప్రధాని మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఈ పోస్ట్‌కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అల్లు అర్జున్ ఏఏ 23 మూవీ థీమ్‌సాంగ్‌ను ఉపయోగించారు.
ఫస్ట్ టైమ్ తెలుగు పాట...
గత కొద్ది రోజులుగా తన పర్యటలను, అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు మోడ్రన్ మ్యూజిక్ వాడుతున్నారు మోదీ. యూత్‌ను ఆకర్షించేందుకు మోదీ న్యూ ఏజ్ మ్యూజిక్ ఉపయోగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. .అయితే ఎక్కువగా హిందీ సాంగ్స్‌ను మోదీ వాడుతుంటారు. ఫస్ట్ టైమ్ ఓ తెలుగు సినిమా పాట...అందులోనూ బన్నీ మూవీ సాంగ్ వాడటంతో టాలీవుడ్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. బన్నీ క్రేజ్‌ను నిదర్శనమిదని అంటున్నారు. మోదీ పోస్ట్‌ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
లోకేష్ కనగరాజ్...
ఏఏ 23 మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ హీరో కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి రాబోతుంది. కాగా ప్రస్తుతం రాకా షూటింగ్‌తో బన్నీ బిజీగా ఉన్నాడు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Traffic restrictions | హైదరాబాద్‌లో 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Upasana Konidela | కామాఖ్య ఆలయంలో రామ్‌చరణ్ సతీమణి ప్రత్యేక పూజలు
- ●Web Series Review | పంచనామా రివ్యూ - యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్...తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
- ●Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి
- ●Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్
- ●Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు

Traffic restrictions | హైదరాబాద్‌లో 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Upasana Konidela | కామాఖ్య ఆలయంలో రామ్‌చరణ్ సతీమణి ప్రత్యేక పూజలు

Web Series Review | పంచనామా రివ్యూ - యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్...తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి






