Sunitha | చిన్నారులపై అఘాయిత్యం చేస్తే కాల్చి పడేయాలి
Sunitha | రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయని.. ఆడ పిల్లల్ని కనాలంటేనే భయపడే పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 6 శాతం ఫోక్సో కేసులు నమోదైతే ఒక్క తెలంగాణలో 16 శాతం కేసులు నమోదయ్యాయన్నారు.
- అప్పుడే నేరాలు తగ్గుతాయి
- ఆడపిల్లల్ని కనాలంటేనే భయపడే పరిస్థితి ఉంది
- శాంతి భద్రతలపై ఒక్క సమీక్ష కూడా పెట్టలే
- బండి సంజయ్, రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారో చెప్పాలి
- మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్
Sunitha | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయని.. ఆడ పిల్లల్ని కనాలంటేనే భయపడే పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 6 శాతం ఫోక్సో కేసులు నమోదైతే ఒక్క తెలంగాణలో 16 శాతం కేసులు నమోదయ్యాయన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని నడి రోడ్డు మీద తిప్పి కాల్చి పడేయాలన్నారు. నిందితులకు ఇలాంటి శిక్షలు విధిస్తేనే నేరాలు తగ్గుతాయని చెప్పారు. ఈమేరకు మంగళవారం ఆమె తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
మోదీ భేటీ బచావో, భేటీ పడావో అంటారు. కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర హోంమంత్రి అలియాస్ ముఖ్యమంత్రి, కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఇప్పటి వరకు సమీక్ష లేదు. కాంగ్రెస్ సర్పంచ్ చిన్నారిపై దాడి చేస్తే పోలీసు వాళ్లు సెటిల్‌మెంట్ చేశారు అని ఆమె ఆరోపించారు.
మహిళలకు రక్షణ లేదు..
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం అంటున్నారు. ముందు తెలంగాణలో చిన్నారులను కాపాడండి. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడులు సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీకి తెలియవా? సీతక్క నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లి ఖమ్మం బాధితురాలిని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. కానీ చిన్నారులపై నేరాలకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీతక్క చెప్పాలి. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించాలి అని సునీత డిమాండ్ చేశారు.
బండి భగీరథ్ కేసు విషయంలో తొలుత వీక్ సెక్షన్లు పెట్టారు. రాష్ట్రంలో మహిళలు రోడ్డు ఎక్కితే అప్పుడు సెక్షన్లు మార్చారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని నడి రోడ్డు మీద తిప్పి కాల్చి పడేయాలి. నిందితులకు ఇలాంటి పనిష్ మెంట్ ఇస్తే నేరాలు తగ్గుతాయి. సౌదీ అరేబియా లాంటి దేశంలో ఉన్న చట్టాలను ఇక్కడ అమలు చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించాలి అని ఆమె సూచించారు.
చట్టలు బడా బాబులకు అనుకూలంగా మారుతున్నాయి. సామాన్యుల విషయంలో మాత్రమే చట్టాలు కఠినంగా ఉంటాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు ధైర్యం ఉండేది. షీ టీమ్స్, భరోసా, మఫ్టీలో ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే సునీత నిలదీశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి
సెప్టెంబర్ 11, 2026

Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు
సెప్టెంబర్ 11, 2026

Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Traffic restrictions | హైదరాబాద్లో 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Upasana Konidela | కామాఖ్య ఆలయంలో రామ్చరణ్ సతీమణి ప్రత్యేక పూజలు
- ●Web Series Review | పంచనామా రివ్యూ - యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్...తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
- ●Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి
- ●Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్గా త్రివిక్రమ్
- ●Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు

Traffic restrictions | హైదరాబాద్లో 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Upasana Konidela | కామాఖ్య ఆలయంలో రామ్చరణ్ సతీమణి ప్రత్యేక పూజలు

Web Series Review | పంచనామా రివ్యూ - యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్...తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి



