HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
HD Kumaraswamy | మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) రూ.600 కోట్లతో డీల్ కుదుర్చుకున్నారని కేంద్ర మంత్రి, జనతాదళ్ నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్యపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ వెనుక కాంగ్రెస్ అంతర్గత కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
HD Kumaraswamy | త్రినేత్ర న్యూస్ : కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar)పై కేంద్ర మంత్రి, జనతాదళ్ నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ (Deve Gowda) కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు సీఎం డీకే రూ.600 కోట్లతో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ డీకే వరుస కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఆ కుట్రల్లో రూ.600 కోట్ల డీల్ కూడా భాగమని సంచలన ఆరోపణలు చేశారు.
"మా కుటుంబాన్ని అంతం చేయాలని ఆదేశించింది మరెవరో కాదు. ప్రస్తుత ముఖ్యమంత్రే (డీకే శివకుమార్‌ను ఉద్దేశిస్తూ). మా కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ఆయన ఎన్నో కుట్రలు పన్నారు. అందులో రూ. 600 కోట్ల సుపారీ డీల్ కూడా ఒకటి" అని విలేకరులతో మాట్లాడుతూ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, మాజీ సీఎం సిద్ధరామయ్యపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ (sting operation) కేసులో తనను, తన పార్టీని ఇరికించేందుకు సీఎం శివకుమార్, హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.
2023లో జరిగిన ఈ స్టింగ్ ఆపరేషన్ వెనుక కాంగ్రెస్ అంతర్గత కుట్ర ఉందని కుమారస్వామి అనుమానం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి తాను సీఎం కావడానికి డీకే శివకుమార్ ఉద్దేశపూర్వకంగా ఈ స్టింగ్ ఆపరేషన్‌ను ఒక సాధనంగా వాడుకున్నారని చెప్పారు. ఈ విషయం శివకుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు ముందే తెలుసని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని కుమారస్వామి డిమాండ్ చేశారు.
Also Read..
రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!
గుట్కా నమిలి కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DK Shivakumar Warning IT Firms | కన్నడ వారికి ఉద్యోగాల్లో మొండిచెయ్యి చూపిస్తే ఊరుకోం
అక్టోబర్ 25, 2026

DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్
అక్టోబర్ 17, 2026

DK Shivakumar Kurta Row | డీకే శివకుమార్ కుర్తా పట్టుకుని లాగిన రాహుల్ గాంధీ : వీడియో వైరల్
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
- ●Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు
- ●Mutual Funds | మిడ్‌క్యాప్ షేర్లతో అధిక రాబడులు.. ప్రభుత్వ బాండ్లతో స్థిరత్వం..
- ●Ayodhya Ram Mandir | భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!
- ●Farmhouse | పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద మృతి
- ●Rain Update | అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు

Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు

Mutual Funds | మిడ్‌క్యాప్ షేర్లతో అధిక రాబడులు.. ప్రభుత్వ బాండ్లతో స్థిరత్వం..

Ayodhya Ram Mandir | భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!



