Kangana Ranut | కలిసిరాని బాలీవుడ్ – హారర్ మూవీతో టాలీవుడ్‌లోకి కంగనా రనౌత్ రీఎంట్రీ
ప్రభాస్ ఏక్ నిరంజన్ తర్వాత పంతొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఓ హారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే?
Entertainment | Published On Oct 26, 2026, 1.33 pm IST
Kangana Ranut | గత కొన్నేళ్లుగా కంగనా రనౌత్ (Kangana Ranaut) బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కొడుతూ వస్తోన్నాయి. మంచి హిట్టు అందుకొని పదేళ్లు దాటిపోయింది. 2015లో రిలీజైన తను వెడ్స్ మను రిటర్న్స్ తర్వాత కంగనా నటించిన సినిమాలకు అవార్డులు వచ్చినా డబ్బులు మాత్రం రాలేదు. చివరకు తానే డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా మారి సినిమాలు చేసింది. నష్టాలే మిగిల్చడం తప్పితే కంగనా ఆ సినిమాలే ఏ విధంగా హెల్పవ్వలేదు.
హారర్ థ్రిల్లర్...
బాలీవుడ్‌పై ఆశలు వదులుకున్న ఈ బ్యూటీ ఓ తెలుగు (Tollywood)సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు పంతొమ్మిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. తెలుగులో వెరైటీ సినిమాల డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న రవిబాబు దర్శకత్వంలో కంగనా రనౌత్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. హారర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రయోగాత్మకంగా...
తెలుగులో గతంలో వచ్చిన హారర్ (Horror Movie )సినిమాలకు భిన్నమైన పాయింట్‌తో ప్రయోగాత్మకంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలిసింది. రవిబాబు చెప్పిన పాయింట్ నచ్చడంతో కంగనా ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతోన్నారు. త్వరలోనే కంగనా రనౌత్ తెలుగు మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రభాస్ మూవీ...
పంతొమ్మిదేళ్ల క్రితం ప్రభాస్ (Prabhas) హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏక్ నిరంజన్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కంగనా రనౌత్. ప్రభాస్ మూవీ ఫెయిలవ్వడంతో కంగనా మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు.
తమిళంలో...
ప్రస్తుతం తమిళంలో (Kollywood)సర్కిల్ పేరుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మాధవన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు కలిసిరాకపోవడంతోనే దక్షిణాది సినిమాలపై ఈ బీజేపీ ఎంపీ ఫోకస్ పెడుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో బిగ్‌బాస్ భామ – అప్డేట్పై ఫన్నీకామెంట్స్
అక్టోబర్ 24, 2026

Raashi Khanna | సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖన్నా – ఫొటోలపై ఓ లుక్కేయండి!
అక్టోబర్ 24, 2026

Vijay Deverakonda | కొత్త ఏడాదిలో సెట్స్‌పైకి విజయ్ దేవరకొండ మైథాలజీ మూవీ – కన్నడ నాయికతో రొమాన్స్
అక్టోబర్ 24, 2026
తాజావార్తలు
- ●Asaduddin Owaisi | మైనారిటీల సమస్యలపై ప్రతిపక్షాలు మౌనం ఎందుకు..? : ఒవైసీ
- ●DK Aruna | డిండి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలి.. డీకే అరుణ డిమాండ్
- ●Ramachander Rao | కాంగ్రెస్ పాలన పట్ల తెలంగాణ యువత అసంతృప్తి : ఎన్ రామచందర్ రావు
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయడం మరింత సులభం..
- ●Harish Rao | ఆందోళనలో 50 వేల మంది సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు..!
- ●Rahul Gandhi | అమిత్ షాపై గెలిచిన రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసు కొట్టివేత

Asaduddin Owaisi | మైనారిటీల సమస్యలపై ప్రతిపక్షాలు మౌనం ఎందుకు..? : ఒవైసీ

DK Aruna | డిండి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలి.. డీకే అరుణ డిమాండ్

Ramachander Rao | కాంగ్రెస్ పాలన పట్ల తెలంగాణ యువత అసంతృప్తి : ఎన్ రామచందర్ రావు

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయడం మరింత సులభం..



