Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే (Purvanchal Expressway)పై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పార్టీ కార్యకర్తలు, సిబ్బంది గాయపడ్డారు. అయితే, రాహుల్ మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే (Purvanchal Expressway)పై సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. తనపై ఉన్న 2018 నాటి పరువు నష్టం కేసుకు సంబంధించి తీర్పు నేపథ్యంలో రాహుల్ ఇవాళ ఉదయం సుల్తాన్‌పూర్ కోర్టుకు బయల్దేరారు. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక పార్టీ నేతలు విమానాశ్రయానికి తరలివచ్చారు.
అనంతరం భారీ కాన్వాయ్‌తో రాహుల్ కోర్టుకు బయల్దేరారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ కాన్వాయ్‌లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఐదు కార్లు, ఒక అంబులెన్స్ పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పార్టీ కార్యకర్తలు, సిబ్బంది గాయపడ్డారు. అయితే, రాహుల్ మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగళూరు(Bangalore)లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)ని ఉద్దేశించి రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో సుల్తాన్‌పూర్ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్, బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న రాహుల్ గాంధీపై ఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో సుల్తాన్‌పూర్ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించనుంది.
VIDEO | Sultanpur, Uttar Pradesh: Congress MP Rahul Gandhi's convoy involved in a minor collision on the Purvanchal Expressway; the Congress leader is safe and no one was seriously injured.
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
#RahulGandhi
— Press Trust of India (@PTI_News) October 26, 2026
Also Read..
భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!
మిడ్‌క్యాప్ షేర్లతో అధిక రాబడులు.. ప్రభుత్వ బాండ్లతో స్థిరత్వం..
గుట్కా నమిలి కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు
- ●Mutual Funds | మిడ్‌క్యాప్ షేర్లతో అధిక రాబడులు.. ప్రభుత్వ బాండ్లతో స్థిరత్వం..
- ●Ayodhya Ram Mandir | భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!
- ●Farmhouse | పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద మృతి
- ●Rain Update | అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
- ●Stock Markets | ముడిచమురు ధరల సెగ.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు

Mutual Funds | మిడ్‌క్యాప్ షేర్లతో అధిక రాబడులు.. ప్రభుత్వ బాండ్లతో స్థిరత్వం..

Ayodhya Ram Mandir | భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!

Farmhouse | పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద మృతి






