త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఆందోళ‌న‌లో 50 వేల మంది సివిల్ ఇంజినీరింగ్ అభ్య‌ర్థులు..!

Harish Rao | నవంబర్ 6న జరగాల్సిన టీజీపీఎస్సీ(TGPSC) ఆర్ అండ్ బీ(R&B) ఏఈఈ (AEE) పరీక్ష, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎస్సెస్సీ జేఈ(SSC JE) పరీక్ష ఒకేరోజు రావడంతో 50 వేల మందికి పైగా సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు( Harish Rao ) పేర్కొన్నారు.

S

Telangana | Published On Oct 26, 2026, 12.56 pm IST

Harish Rao | ఆందోళ‌న‌లో 50 వేల మంది సివిల్ ఇంజినీరింగ్ అభ్య‌ర్థులు..!
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్ : నవంబర్ 6న జరగాల్సిన టీజీపీఎస్సీ(TGPSC) ఆర్ అండ్ బీ(R&B) ఏఈఈ (AEE) పరీక్ష, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎస్సెస్సీ జేఈ(SSC JE) పరీక్ష ఒకేరోజు రావడంతో 50 వేల మందికి పైగా సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు( Harish Rao ) పేర్కొన్నారు. ఎస్సెస్సీ ఇప్పటికే పరీక్ష తేదీని కన్‌ఫ‌ర్మ్ చేస్తూ వెబ్‌సైట్‌లో షెడ్యూల్ విడుదల చేసిందన్నారు.

ఈ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏది రాయాలో, ఏది వదులుకోవాలో తేల్చుకోలేక తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు పలుమార్లు మంత్రులకు, అధికారులకు మొరపెట్టుకున్నా, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

ప్రభుత్వ బేషజాల వల్ల విద్యార్థులు ఒక విలువైన అవకాశాన్ని కోల్పోయి వారి భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి టీజీపీఎస్సీ ఆర్ అండ్ బీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలి. అభ్యర్థులందరూ రెండు పరీక్షలు రాసేలా వెసులుబాటు కల్పించి వారి భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement