త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WPL 2027 | డబ్ల్యూపీఎల్‌ 2027 షెడ్యూల్‌ విడుదల.. జనవరి 14 నుంచి మహిళల క్రికెట్‌ సమరం

WPL 2027 | మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. 2027 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ టోర్నీ జరగనుంది. వడోదర, ముంబై వేదికలుగా మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. రెండు వేదికల్లోనూ 11 మ్యాచుల‌ చొప్పున జరగనున్నాయి.

P

Sports | Published On Nov 4, 2026, 8.29 pm IST

WPL 2027 | డబ్ల్యూపీఎల్‌ 2027 షెడ్యూల్‌ విడుదల.. జనవరి 14 నుంచి మహిళల క్రికెట్‌ సమరం
Advertisement

WPL 2027 | మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. 2027 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ టోర్నీ జరగనుంది. వడోదర, ముంబై వేదికలుగా మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. రెండు వేదికల్లోనూ 11 మ్యాచుల‌ చొప్పున జరగనున్నాయి.

తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ X ముంబ‌యి ఇండియన్స్‌

డబ్ల్యూపీఎల్‌ 2027 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. జనవరి 14న వడోదర వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. జనవరి 24 వరకు వడోదరలో తొలి దశ పోటీలు కొనసాగుతాయి. ఐదు జట్లు ఈ దశలో మొత్తం 11 మ్యాచ్‌ల్లో పోటీపడతాయి. అనంతరం జనవరి 26 నుంచి టోర్నీ ముంబైకి మారనుంది. బ్రబోర్న్‌ స్టేడియంలోని క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) మైదానం రెండో దశ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఫిబ్రవరి 3 వరకు లీగ్‌ దశ పోటీలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 5న ఎలిమినేటర్‌.. 7న ఫైనల్‌

పాయింట్ల పట్టికలో రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫిబ్రవరి 5న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఫిబ్రవరి 7న బ్రబోర్న్‌ స్టేడియంలో టైటిల్‌ పోరు జరగనుంది.

అన్ని మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకే

డబ్ల్యూపీఎల్‌ 2027లో లీగ్‌ మ్యాచ్‌లతో పాటు ప్లేఆఫ్స్‌ పోటీలు కూడా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఐదు ఫ్రాంచైజీలు, రెండు వేదికల మధ్య జరిగే ఈ పోటీల్లో మరోసారి హోరాహోరీ సమరం చూడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement
Advertisement