CP Sajjanar | దీపావళి కానుక పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
CP Sajjanar | దీపావళి కానుకల (Diwali gift) పేరుతో వచ్చే నకిలీ మెసేజ్‌ల (Fake Message) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) సూచించారు. పేటీఎం దీపావళి కానుకగా అందరికీ రూ.1,000 నగదు ఇస్తున్నదని, వెంటనే క్లెయిమ్ చేసుకోవాలంటూ అంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో వైరల్ అవుతున్న మెసేజ్ పచ్చి మోసమని హెచ్చరించారు.
CP Sajjanar | త్రినేత్ర న్యూస్: దీపావళి కానుకల (Diwali gift) పేరుతో వచ్చే నకిలీ మెసేజ్‌ల (Fake Message) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) సూచించారు. పేటీఎం దీపావళి కానుకగా అందరికీ రూ.1,000 నగదు ఇస్తున్నదని, వెంటనే క్లెయిమ్ చేసుకోవాలంటూ అంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌లో వైరల్ అవుతున్న మెసేజ్ పచ్చి మోసమని హెచ్చరించారు. ‘నేను ఫేక్ అనుకున్నా.. కానీ నిజంగానే రూ.1,000 వచ్చాయి.. మీరు ట్రై చేయండి’ అంటూ నమ్మించే రీతిలో కేటుగాళ్లు పన్నిన ఉచ్చు ఇదని చెప్పారు. పండుగ పూట ప్రజల అమాయకత్వాన్ని, ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ ముఠాలు కాటేసేందుకు సిద్ధమయ్యాయన్నారు.
ఇలాంటి సందేశాలతో పాటు వచ్చే అనుమానాస్పద లింకులను (http://akcxy.buzz వంటి నకిలీ వెబ్‌సైట్లు) పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని సూచించారు. ఈ లింకుల ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించడమే కాకుండా.. మీ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఏ ప్రముఖ సంస్థ కూడా అపరిచిత లింకుల ద్వారా ఉచితంగా నగదు పంపిణీ చేయదని గుర్తించాలన్నారు.
గుర్తుతెలియని, అనుమానాస్పద వెబ్‌సైట్ లింకులపై క్లిక్ చేయవచ్చని సూచించారు. అదేవిధంగా నకిలీ ఆఫర్లను నిజమని నమ్మి ఇతర వాట్సాప్ గ్రూపులకు, బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేసి ఇతరులనూ ముప్పులోకి నెట్టొద్దన్నారు. ఎలాంటి సందర్భంలోనూ బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. ఒకవేళ మోసపోతే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫోన్ చేయాలని, లేదా https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం
- ●Bollywood OTT | రెండు కోట్ల బడ్జెట్ - 450 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ
- ●Student Suicide | హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?
- ●MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు
- ●US Reward | ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్ల రివార్డ్.. అమెరికా భారీ ఆఫర్
- ●White House | వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హనుమాన్ చాలీసా

Rahul Gandhi | ఈ 20 కాస్త 420గా మారింది.. కేంద్రంపై రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం

Bollywood OTT | రెండు కోట్ల బడ్జెట్ - 450 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మైథాలజీ మూవీ

Student Suicide | హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా?

MP Abhishek Banerjee | నాపై ఏడుసార్లు హత్యాప్రయత్నం చేశారు.. అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు






