త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India invites Pakistan | భార‌త్ నుంచి పాక్‌కు ఆహ్వానం.. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత తొలిసారి అధికారిక పిలుపు

India invites Pakistan | ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor) అనంత‌రం తొలిసారి భార‌త్ నుంచి పాకిస్థాన్‌కు ఆహ్వానం వెళ్లింది (India invites Pakistan). నవంబర్ 20-22 తేదీల్లో ఢిల్లీ (Delhi)లో జ‌ర‌గ‌నున్న షాంఘై సహకార సంస్థ (SCO) తొలి సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్‌కు హాజ‌రుకావాల్సిందిగా ఆ దేశ సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచీకి అధికారికంగా ఆహ్వానం పంపింది.

D

National | Published On Oct 28, 2026, 1.42 pm IST

India invites Pakistan | భార‌త్ నుంచి పాక్‌కు ఆహ్వానం.. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత తొలిసారి అధికారిక పిలుపు
Advertisement

India invites Pakistan | త్రినేత్ర న్యూస్ : భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తారాస్థాయికి చేరిన‌ వేళ తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత తొలిసారి భార‌త్ నుంచి పాక్‌కు ఆహ్వానం వెళ్లింది (India invites Pakistan). నవంబర్ 20-22 తేదీల్లో ఢిల్లీ (Delhi)లో జ‌ర‌గ‌నున్న షాంఘై సహకార సంస్థ (SCO) తొలి సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్‌కు (Civilisational Dialogue Forum) హాజ‌రుకావాల్సిందిగా ఆ దేశ సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచీకి భారత ప్రభుత్వం ఆహ్వానం పంపింది.

గతేడాది పెహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)తో గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. ఇక ఈ ఆప‌రేష‌న్ అనంత‌రం చోటు చేసుకున్న ఉద్రిక్త‌తల‌ త‌ర్వాత పాక్ మంత్రిని భార‌త్ నేరుగా ఆహ్వానించ‌డం ఇదే తొలిసారి. గతంలో 2023 మే నెలలో గోవాలో జరిగిన SCO విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్థాన్ చివ‌రిసారిగా హాజ‌రైంది.

ఇక ఈ సదస్సుకు ఎస్‌సీఓలో ఉన్న 10 సభ్య దేశాలనూ ఆహ్వానించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్‌తో ఉన్న‌ ద్వైపాక్షిక సంబంధాలతో ఎలాంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేవారు. ఈ పరిణామాన్ని మరింత విస్తృత దృక్పథంతో చూడాలని పేర్కొన్నారు. కాగా, ఇటీవ‌లే త‌జికిస్థాన్‌లోని దుషాంబేలో జ‌రిగిన 25వ ఎస్‌సీఓ ప్ర‌భుత్వ అధిప‌తుల మండ‌లి స‌మావేశంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా పాక్ ఉప ప్ర‌ధాని, ర‌క్ష‌ణ మంత్రి ఇషాక్ దార్ స‌మ‌క్షంలోనే పాక్‌కు గ‌ట్టి సందేశం ఇచ్చారు. ఉగ్ర‌వాదాన్ని అంతం చేయ‌డానికి ఉమ్మ‌డి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స‌భ్య దేశాల‌కు పిలుపునిచ్చారు.

Also Read..

ఫ్లై దుబాయ్ హీరోకి అరుదైన గౌర‌వం.. స్మిత్‌ను అత్యున్న‌త పుర‌స్కారంతో స‌త్కరించిన యూఏఈ

టాటా సంస్థను నేరపూరితంగా నాశనం చేస్తున్నారు : రాహుల్ గాంధీ

20 మార్కెట్లు, 20 మంది వ్యాపారులు, 20 నిమిషాలు.. రాహుల్ ముందు ఢిల్లీ వ్యాపారుల కీల‌క ప్ర‌తిపాద‌న‌

Advertisement
Advertisement