Ramachander Rao | మాటిమాటికి సీఎం ఢిల్లీ ఎందుకు పోతున్నడు..?
Ramachander Rao | రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాత్రం ఆ సమస్యను గాలికి వదిలేసి.. మాటిమాటికి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు( Ramachander Rao ) నిలదీశారు.
ఢిల్లీ బాట పట్టడం రాజకీయ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం
సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా..
కొండారెడ్డిపల్లిలో ఎన్ని ఓట్లు తొలగించారో నిరూపించండి
మీడియా సమావేశంలో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
Ramachander Rao | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాత్రం ఆ సమస్యను గాలికి వదిలేసి.. మాటిమాటికి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు( Ramachander Rao ) నిలదీశారు. కరువు నివారణ చర్యలు తీసుకోకుండా.. రేవంత్ ఢిల్లీ బాట పట్టడం ఆయన రాజకీయ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో వర్షాభావం వల్ల 330 మండలాలు కరువును ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆరు వేలకు పైగా చెరువులు ఉంటే.. కేవలం 500 చెరువుల్లోనే నీరు ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందన్నారు. ‘రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లుగా, రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఉంటే సీఎం ఢిల్లీ ర్యాలీలకు వెళ్తున్నారు’ అని రామచందర్ రావు విమర్శించారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని రామచందర్ రావు ఆరోపించారు. దేశంలో గుర్తించిన 13 కోట్ల ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాల్లో మరణించినవారు, వేరే ప్రాంతాలకు మారినవారు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. ‘రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా.. మీ సొంతూరు కొండారెడ్డిపల్లికి వస్తా.. సమయం చెప్పండి. అక్కడ ఎన్ని ఓట్లు తొలగించారో నిరూపించండి’ అని సవాలు విసిరారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటూ తొలగించబడదని రామచందర్ రావు భరోసా ఇచ్చారు.
సంబంధిత వార్తలు

MLC Dasoju Sravan | అప్పుడు 10.36 లక్షల ఓట్లుంటే.. ఇప్పుడు 4.98 శాతమే నమోదైనయ్
అక్టోబర్ 26, 2026

Cyclone Arnab | అర్నాబ్ ఎఫెక్ట్.. రేపట్నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
అక్టోబర్ 26, 2026

Talasani Srinivas Yadav | ఓటరు నమోదు బాధ్యత ముమ్మాటికీ ఎన్నికల కమిషన్దే
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●MLC Dasoju Sravan | అప్పుడు 10.36 లక్షల ఓట్లుంటే.. ఇప్పుడు 4.98 శాతమే నమోదైనయ్
- ●Supreme Court | ఫామ్ 6 సమర్పించినందుకు ఓటర్లపై ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు.. సుప్రీంకోర్టు భరోసా
- ●Sai Pallavi | నిత్యారెడ్డి ఆగయా - ధనుష్ సినిమాలో పోలీస్ పాత్రలో సాయిపల్లవి
- ●Cyclone Arnab | అర్నాబ్ ఎఫెక్ట్.. రేపట్నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
- ●Judicial officers Retirement Age | జడ్జీల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు: 14 రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో భారీ రికవరీ.. 483 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

MLC Dasoju Sravan | అప్పుడు 10.36 లక్షల ఓట్లుంటే.. ఇప్పుడు 4.98 శాతమే నమోదైనయ్

Supreme Court | ఫామ్ 6 సమర్పించినందుకు ఓటర్లపై ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు.. సుప్రీంకోర్టు భరోసా

Sai Pallavi | నిత్యారెడ్డి ఆగయా - ధనుష్ సినిమాలో పోలీస్ పాత్రలో సాయిపల్లవి

Cyclone Arnab | అర్నాబ్ ఎఫెక్ట్.. రేపట్నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!



