Fire Broke Out Parliament | పార్లమెంట్‌లో అగ్నిప్రమాదం.. నార్త్‌బ్లాక్ నుంచి నల్లటి పొగ
Fire Broke Out Parliament | పార్లమెంట్ (Parliament) సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కేంద్ర పరిపాలనా భవనం నార్త్‌బ్లాక్ (North Block) నుంచి నల్లటి పొగ వెలువడింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ఆరు ఫైరింజన్లతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Fire Broke Out Parliament | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని పార్లమెంట్ (Parliament) సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది (Fire Broke Out Parliament). కేంద్ర పరిపాలనా భవనం నార్త్‌బ్లాక్ (North Block) నుంచి నల్లటి పొగ (Black smoke) వెలువడింది. అప్రమత్తమైన సిబ్బంది, అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ఆరు ఫైరింజన్లతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ భవనం పైకప్పుపై పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో అక్కడ కొందరు కార్మికులు కూడా ఉన్నారని చెప్పారు. నార్త్ బ్లాక్ పైకప్పుపై అమర్చిన ఏసీ బాయిలర్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఏసీ బాయిలర్లలో ఒకదానిలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై రాజ్యసభ ఎంపీ మిలింద్ డియోరా (MP Milind Deora) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. పార్లమెంట్‌కు వెళ్తున్న సమయంలో నార్త్ బ్లాక్ వెనుక భాగం నుండి పొగలు రావడాన్ని గమనించి ఆయన అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కేంద్ర హోం శాఖ, ఆర్థిక శాఖ వంటి అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు ఈ నార్త్ బ్లాక్ భవనంలోనే ఉన్నాయి. మంటలు త్వరగానే అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read..
రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. స్వల్పంగా పెరిగిన ధరలు..
- ●HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
- ●Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు
- ●Mutual Funds | మిడ్‌క్యాప్ షేర్లతో అధిక రాబడులు.. ప్రభుత్వ బాండ్లతో స్థిరత్వం..
- ●Ayodhya Ram Mandir | భక్తులకు అలర్ట్.. అయోధ్య రామ మందిర వేళల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..!

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. స్వల్పంగా పెరిగిన ధరలు..

HD Kumaraswamy | మా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. రూ.600 కోట్లతో డీల్.. సీఎం డీకేపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

Rahul Gandhi | రాహుల్ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఒకదానికొకటి ఢీ కొన్న వాహనాలు.. పలువురికి గాయాలు

Electric Shock | గుట్కా నమిలి.. కరెంట్ తీగపై ఉమ్మాడు.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు






