Telangana Global Summit | ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. 29న ఢిల్లీలో ఘనంగా కర్టెన్ రైజర్
Telangana Global Summit | రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా `ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026` (Telangana Global Summit) నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లో భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) వేదికగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనుంది.
Telangana Global Summit | త్రినేత్ర న్యూస్: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా `ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026` (Telangana Global Summit) నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లో భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) వేదికగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ నెల 29న ఢిల్లీలో ఘనంగా గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ (Curtain Raiser) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, గ్లోబల్ కంపెనీల సీఈఓలు, ప్రపంచ బ్యాంకు, వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో (Telangana) ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను అగ్రగామి కంపెనీల సీఈఓలకు ప్రభుత్వం వివరించనుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలను సమ్మిట్ లో భాగస్వాములను చేయడానికి ఇప్పటికే పలు దేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోనూ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు (Invest Telangana) విస్తృత స్థాయి ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో జరగనున్న కర్టెన్ రైజర్ కార్యక్రమానికి అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్, తైవాన్ ఎక్సటర్నల్ ట్రేడ్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇండో-కెనడా బిజినెస్ చాంబర్ తరఫున అతిథులు, వివిధ స్టార్టప్‌ల సీఈఓలు హాజరుకానున్నారు. దీనికి సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), ఇన్వెస్ట్ ఇండియా సంస్థలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.
ఫార్చ్యూన్-2000 జాబితాలో నుంచి 165కుపైగా కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యకలాపాలు ఉండటం, వరుసగా ఆరుసార్లు దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలవడం, టెక్నాలజీ ఆవిష్కరణల్లో నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో దేశంలోనే రెండో స్థానంలో నిలవడం, ఐటీ, ఫార్మా, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉండడం తెలంగాణ ప్రత్యేకతలుగా ఈ కార్యక్రమంలో వివరించనున్నారు.
తాజావార్తలు
- ●TGPSC | ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ ఊరట.. AEE ఎగ్జామ్ తేదీ మార్పు
- ●Horoscope | అక్టోబర్ 27 రాశిఫలాలు.. ఈ రాశివారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం!
- ●Tummidihetti Barrage Project | మహారాష్ట్ర ప్రయోజనాలే మా ప్రయారిటీ
- ●Anupama Parameswaran | అచ్చ తెలంగాణ యాసలో - భోగి కోసం అనుపమ పరమేశ్వరన్ డబ్బింగ్
- ●Needala Prapancham book launch | సమాజ డొల్లతనాన్ని ఎండగట్టిన 'నీడల ప్రపంచం': రవీంద్రభారతిలో తిర్మల్ పుస్తకావిష్కరణ
- ●Malavika Mohanan | రెడ్ డ్రెస్‌లో రాజాసాబ్ హీరోయిన్ హాట్ షో

TGPSC | ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ ఊరట.. AEE ఎగ్జామ్ తేదీ మార్పు

Horoscope | అక్టోబర్ 27 రాశిఫలాలు.. ఈ రాశివారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం!

Tummidihetti Barrage Project | మహారాష్ట్ర ప్రయోజనాలే మా ప్రయారిటీ

Anupama Parameswaran | అచ్చ తెలంగాణ యాసలో - భోగి కోసం అనుపమ పరమేశ్వరన్ డబ్బింగ్






