త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ.. ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు: హరీశ్ రావు

Harish Rao | ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేట‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హరీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న లూటీఫికేషన్ ప్రయత్నాలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుంద‌ని చెప్పారు.

G

Telangana | Published On Oct 28, 2026, 1.16 pm IST

Harish Rao | ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ.. ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు: హరీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేట‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హరీశ్ రావు (Harish Rao) విమ‌ర్శించారు. మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ (House Arrest) చేయడం, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ (BRS) నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మీ నిర్లక్ష్యం వల్ల కరువు బారిన పడిన రైతులను, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం మానేసి.. మూసీ ప్రక్షాళన (Musi Project) పేరుతో రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటారా? అని నిల‌దీశారు.

కమిషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ.. కరువు బాధిత రైతులను ఆదుకోవడంలో లేకపోవడం శోచనీయమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఒక వైపు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, మరోవైపు పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు ఎంతకాలం నొక్కుతారని నిల‌దీశారు. ఇలా ఎన్ని రోజులు అణచివేస్తారని మండిప‌డ్డారు. తెలంగాణ (Telangana) సమాజం మీకు తప్పక బుద్ధి చెబుతుందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న లూటీఫికేషన్ ప్రయత్నాలను తిప్పికొడుతుంద‌ని చెప్పారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement