త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mujeeb | మైనారిటీల‌కు 1000 కోట్లిస్త‌మ‌న్న‌రు.. కానీ 10 రూపాలు కూడా అంద‌లే

Mujeeb | మైనారిటీల (Minorities) సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం 1000 కోట్లు ఇస్తామన్నార‌ని.. కానీ ఇప్ప‌టికీ రూ.10 కూడా అంద‌లేద‌ని బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముజీబ్ (Mujeeb) విమర్శించారు.

S

Telangana | Published On Nov 14, 2026, 2.01 pm IST

Mujeeb | మైనారిటీల‌కు 1000 కోట్లిస్త‌మ‌న్న‌రు.. కానీ 10 రూపాలు కూడా అంద‌లే
Advertisement
  • ప్ర‌త్యేక డీఎస్సీ అన్న‌రు.. అదీ లేదు
  • మౌజంల‌కు 10 వేలు ఇస్త‌మ‌న్న‌రు.. అస‌లు ఉన్న‌యే అందుత‌లేవ్‌
  • మైనారిటీకి మంత్రి ప‌ద‌విస్తే ఆయ‌న ఎటెటో తిరుగుతుండు
  • బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముజీబ్ విమ‌ర్శ‌లు

Mujeeb | త్రినేత్ర న్యూస్‌: మైనారిటీల (Minorities) సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం 1000 కోట్లు ఇస్తామన్నార‌ని.. కానీ ఇప్ప‌టికీ రూ.10 కూడా అంద‌లేద‌ని బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముజీబ్ (Mujeeb) విమర్శించారు. ముస్లిం సోద‌రుల‌కు ప్ర‌త్యేక డీఎస్సీ (Special DSC) అని చెప్పి మ‌రిచిపోయార‌న్నారు. మౌజంల‌కు 10 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చి.. అస‌లు ఉన్న‌యే అంద‌కుండ చేశార‌ని ఆరోపించారు. ఇక ఓ మైనారిటీకి మంత్రి ప‌ద‌వి ఇస్తే ఆయ‌న ఎక్క‌డెక్క‌డో తిరుగుతున్నార‌ని ఎద్దేవా చేశారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

మైనారిటీ యువతకు ఆర్థిక సహాయం చేస్తామ‌న్నారు. వారి దగ్గర అప్లికేషన్ కు 200 రూపాయలు వసూలు చేసి మీ ఖజానా నింపుకున్నారు. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఇందిరమ్మ ఇండ్ల బిల్లు కూడా పూర్తి స్థాయిలో రావడం లేదు. అభయ హస్తం లేదు.. యువ వికాసం లేదు. రేవంత్ రెడ్డి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి మోసాలు చేసిండు. మైనారిటీలకు కూడా సంక్షేమ పథకాలు అమలులో జాప్యం చేస్తున్న‌డు.

13 డిక్లరేషన్ లు, 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. ఢిల్లీలోని అగ్ర నాయకులను తెచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి మైనారిటీల‌కు అమలు చేస్తామని చెప్పారు. ఇక్కడ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. ఇవాళ ఎందుకు మర్చిపోయావు రేవంత్‌? మైనారిటీల కోసం 4 వేల కోట్లు కేటాయిస్తామ‌ని అన్నారు. సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికి నోచుకోలేదు.

అస‌దుద్దీన్ కాంగ్రెస్‌తో ఎందుకు క‌లిశాడు?

నాడు కేసీఆర్ గంగ జమున తేజిబ్ అని అన్ని వర్గాల, అన్ని మతాల ప్రజలకు అందించారు. మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తామ‌న్నారు.. ఎక్కడ పోయాయి? ప్రజల సొమ్ముతో బర్త్ డే జరుపుకోవడం కాదు.. ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. అమిత్ షా తమ హామీలు జుమ్లా అన్నట్టే రేవంత్ రెడ్డి కూడా ముస్లింలపై చేసిన ప్రకటన కూడా జుమ్ల లాంటిదే. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వారి పాట పాడుతుంది. కేసీఆర్ బతికున్నంత వరకు ఆయనతోనే ఉంటామన్న అసదుద్దీన్.. కాంగ్రెస్‌తో ఎందుకు కలిశాడు? అని ముజీబ్ నిల‌దీశారు.

Advertisement
Advertisement