Ashok Galla | అచ్చ తెలుగు హీరోయిన్‌తో మహేష్‌బాబు మేనల్లుడి మూవీ – షూటింగ్ మొత్తం అమెరికాలోనే!
మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న వీసా (వింటారా సరదాగా) మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. నూతన ఏడాది సందర్భంగా 2027 జనవరి 1న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. వీసా మూవీలో అశోక్ గల్లాకు జోడీగా అచ్చ తెలుగు అమ్మాయి శ్రీ గౌరిప్రియ హీరోయిన్‌గా నటించబోతుంది.
Entertainment | Published On Nov 14, 2026, 2.40 pm IST
Ashok Galla | వచ్చే ఏడాది హీరోగా రెండు సినిమాలతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ప్రస్తుతం హుషారు 2 తో పాటు వీసా సినిమాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు పూర్తయ్యాయి.
వింటారా సరదాగా...
తాజాగా వీసా (వింటారా సరదాగా) మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ శనివారం ప్రకటించారు. ఉద్భవ్ రఘు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కొత్త ఏడాది సందర్భంగా 2027 జనవరి 1ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా అచ్చ తెలుగు బ్యూటీ శ్రీ గౌరిప్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో...
వీసా మూవీ సినిమా షూటింగ్ చాలా వరకు అమెరికాలోనే సాగింది. తమ కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో అమెరికాకు వెళ్లిన ఓ నలుగురు తెలుగు విద్యార్థుల జీవితాల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవనశైలి, స్నేహాలు, ప్రేమలను వినోదాత్మకంగా ఈ సినిమాలో దర్శకుడు ఆవిష్కరించారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా అంతర్లీనంగా ఓ మెసేజ్‌ను ఇవ్వబోతున్నారు.
కెమిస్ట్రీ హైలైట్...
వీసా మూవీ నుంచి ఇటీవలే టీజర్‌తో పాటు రెండు పాటలను రిలీజ్ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోన్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరిప్రియ కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు ప్రకటించారు.
వీసాతో పాటు అశోక్ గల్లా హీరోగా నటించిన మరో తెలుగు కామెడీ మూవీ హుషారు 2 కూడా వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ruhani Sharma | విరాట్ కోహ్లి మరదలి తెలుగు మూవీ – నిర్ణయాలు..వాటి పర్యవసానాలతో “ఆల్కహాల్”
నవంబర్ 12, 2026

Husharu 2 | “హుషారు 2″లో ఆర్ నారాయణమూర్తి – మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్
అక్టోబర్ 27, 2026

Idupu Kayitham | అచ్చ తెలంగాణ ఎమోషన్స్‌తో ఇడుపుకాయితం – రిలీజ్ డేట్ చెప్పేశారు
అక్టోబర్ 23, 2026
తాజావార్తలు
- ●Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?
- ●Microsoft | 36 గంటల నిరీక్షణకు తెర.. మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ
- ●Mujeeb | మైనారిటీలకు 1000 కోట్లిస్తమన్నరు.. కానీ 10 రూపాలు కూడా అందలే
- ●TRAI | స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..
- ●Sam Pitroda | ప్రధాని ఫోన్లను ట్యాప్ చేయరు.. రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా
- ●Gig Workers' Rally | గిగ్ వర్కర్ల ర్యాలీ.. మహిళా స్కూటీపై రాహుల్ ప్రయాణం

Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?

Microsoft | 36 గంటల నిరీక్షణకు తెర.. మైక్రోసాఫ్ట్ సేవలు పునరుద్ధరణ

Mujeeb | మైనారిటీలకు 1000 కోట్లిస్తమన్నరు.. కానీ 10 రూపాలు కూడా అందలే

TRAI | స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..



