TRAI | స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..
TRAI | స్పామ్ కాల్స్, అనవసర వాణిజ్య సందేశాల నియంత్రణకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (టీఆర్ఏఐ) కఠిన చర్యలు చేపట్టింది. గత జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిబంధనలు ఉల్లంఘించిన 1.24 లక్షలకు పైగా టెలికాం కనెక్షన్లపై చర్యలు తీసుకుంది. మరో 374 సంస్థలు, సందేశాల పంపేవారిని ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.
TRAI | స్పామ్ కాల్స్, అనవసర వాణిజ్య సందేశాల నియంత్రణకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (టీఆర్ఏఐ) కఠిన చర్యలు చేపట్టింది. గత జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిబంధనలు ఉల్లంఘించిన 1.24 లక్షలకు పైగా టెలికాం కనెక్షన్లపై చర్యలు తీసుకుంది. మరో 374 సంస్థలు, సందేశాల పంపేవారిని ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.
దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లపై ట్రాయ్ తన చర్యలను మరింత ముమ్మరం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన నివేదిక ప్రకారం, జూలై నుంచి సెప్టెంబర్ మధ్య అనుమతి లేని వాణిజ్య సమాచార నిబంధనలను (యూసీసీ) ఉల్లంఘించిన టెలికాం వనరులపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలిసారి నిబంధనలు ఉల్లంఘించిన 1,10,325 టెలికాం వనరులకు చెందిన మొబైల్ నంబర్లపై 15 రోజుల పాటు అవుట్‌గోయింగ్ సేవలను నిలిపివేసింది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన మరో 13,777 కనెక్షన్లను ఏడాది పాటు పూర్తిగా డిస్‌కనెక్ట్ చేసింది.
మరోవైపు స్పామ్ సందేశాల నియంత్రణలో భాగంగా 3,725 ఎస్ఎంఎస్ హెడర్లను బ్లాక్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా సందేశాలు పంపిన 374 సంస్థలు, పంపేవారిని ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ కాలంలో ఆయా సంస్థలు కొత్త టెలికాం వనరులను పొందేందుకు కూడా అనుమతి ఉండదు. స్పామ్ కాల్స్, సందేశాల ద్వారా ప్రజలను వేధించడం, మోసాలకు పాల్పడే ప్రయత్నాలను అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.
వినియోగదారులకు ట్రాయ్ సూచనలు..
ట్రాయ్ నివేదికలో మరికొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా స్పామ్‌కు సంబంధించి మొత్తం 15.29 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 7.23 లక్షల ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఫిర్యాదుల్లో 92.9 శాతం ట్రాయ్ డూ నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ) యాప్ ద్వారా అందాయి. ప్రమోషనల్ కాల్స్ కోసం 140 సిరీస్ నంబర్లను, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ప్రభుత్వ సేవలకు సంబంధించిన కాల్స్ కోసం 1600 సిరీస్‌ను, యుటిలిటీ, లాజిస్టిక్స్, డెలివరీ సేవల కోసం ఆగస్టు 10 నుంచి 1601 సిరీస్‌ను కేటాయించారు. అనవసర కాల్స్, సందేశాలు వస్తే వినియోగదారులు 1909 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు లేదా డీఎన్‌డీ యాప్ ద్వారా నివేదించవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!






