త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Mataram | వందేమాత‌రం పూర్తి ఆరుచ‌ర‌ణాల‌ను ఆల‌పించిన సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా.. కాంగ్రెస్ అభ్యంత‌రం

Vande Mataram | ఇండియా కూట‌మిలో వందేమాత‌రం (Vande Mataram) ఆలాప‌న‌పై వివాదం మొద‌లైంది. శ్రీ‌న‌గ‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా, ఫ‌రూక్ అబ్దుల్లా (Farooq Abdullah) స‌మ‌క్షంలో జాతీయ గేయం వందేమాత‌రం (Vande Mataram)లోని పూర్తి ఆరు చ‌ర‌ణాల‌ను ఆల‌పించ‌డంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

D

National | Published On Sep 9, 2026, 11.43 am IST

Vande Mataram | వందేమాత‌రం పూర్తి ఆరుచ‌ర‌ణాల‌ను ఆల‌పించిన సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా.. కాంగ్రెస్ అభ్యంత‌రం
Advertisement

Vande Mataram | త్రినేత్ర‌.న్యూస్ : ఇండియా కూట‌మిలో వందేమాత‌రం (Vande Mataram) ఆలాప‌న‌పై వివాదం మొద‌లైంది. శ్రీ‌న‌గ‌ర్‌లో (Srinagar) జ‌రిగిన జమ్ము కశ్మీర్ తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా (CM Omar Abdullah), నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ (National Conference) అధ్య‌క్షుడు ఫ‌రూక్ అబ్దుల్లా (Farooq Abdullah) స‌మ‌క్షంలో జాతీయ గేయం వందేమాత‌రం (Vande Mataram)లోని పూర్తి ఆరు చ‌ర‌ణాల‌ను ఆల‌పించారు. ఆ స‌మ‌యంలో సీఎం, ఫ‌రూక్ అబ్దుల్లా ఇద్ద‌రూ గేయం పూర్త‌య్యే వ‌ర‌కూ నిల‌బ‌డే ఉండ‌టం వివాదానికి దారి తీసింది. త‌న మిత్ర‌ప‌క్ష‌మైన‌ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ తీరుపై హ‌స్తం (Congress) పార్టీ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... దేశ స్వాతంత్య్ర సమరయోధుల భావజాలాన్ని గౌరవించాలని, లౌకిక, సమగ్ర స్ఫూర్తిని కాపాడాలని తన మిత్రపక్షాన్ని కోరారు. అంతేకాదు, 1937 నాటి కాంగ్రెస్ తీర్మానం ప్రకారం వందేమాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని సూచించారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల నిర్ణ‌యాన్ని మిత్ర‌ప‌క్షాలు గౌర‌వించాల‌ని హిత‌వు ప‌లికారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యంత‌రాల‌పై నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ కూడా అదే స్థాయిలో స్పందించింది. మిత్రపక్షాల కార్యక్రమాల్లో ఏ వెర్షన్ పాడాలనే దానిపై కాంగ్రెస్ తమకు షరతులు విధించలేదని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ నిబంధనలకు అనుగుణంగానే గేయాన్ని గౌరవించామని వెల్ల‌డించింది.

జాతీయ గేయానికి స‌ముచిత స్థానం

జాతీయ గీతం ‘జనగణమన..’ స్థాయిలో జాతీయ గేయం వందేమాతరానికి కేంద్రం ఇటీవ‌లే చ‌ట్ట‌ప‌ర‌మైన రక్షణలు క‌ల్పించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే వందేమాత‌రం పూర్తి ఆరుచ‌ర‌ణాల‌ను ఆల‌పించాల్సి ఉంటుంది. అయితే, వందేమాత‌రం ఆలాప‌న విష‌యం కాంగ్రెస్ పార్టీ త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. త‌మ పార్టీ కార్య‌క్ర‌మాల్లో వందేమాత‌రం గేయంలోని మొద‌టి రెండు చ‌ర‌ణాల‌ను మాత్రమే పాడాల‌ని నిర్ణ‌యించింది. స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహనీయుల మద్దతుతో 1937లో చేసిన తీర్మానానికే తాము క‌ట్టుబ‌డి ఉంటామ‌ని హ‌స్తం పార్టీ స్ప‌ష్టం చేసింది.

Also Read..

ఒక్క రోజులోనే రూ.10వేలు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. బులియ‌న్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌..

మహిళా పోలీసులపై దురుసు ప్రవర్తన.. బీఆర్ ఎమ్మెల్యేల‌పై మ‌రో కేసు

స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు.. శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌

Advertisement
Advertisement