త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bank of America | అమెరికా నుంచి భారత్‌కు యూపీఐతో చెల్లింపులు.. బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక అడుగు..

Bank of America | క్రాస్-బోర్డర్ చెల్లింపులను మరింత వేగవంతం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాలోని జెల్, భారత్‌లోని యూపీఐ మధ్య అనుసంధానం కల్పించే మార్గంపై బ్యాంక్ పనిచేస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే రెండు దేశాల మధ్య నగదు బదిలీలు మరింత సులభంగా, వేగంగా జరిగే అవకాశం ఉంది.

S

Business | Published On Sep 9, 2026, 9.38 am IST

Bank of America | అమెరికా నుంచి భారత్‌కు యూపీఐతో చెల్లింపులు.. బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక అడుగు..
Advertisement

Bank of America | క్రాస్-బోర్డర్ చెల్లింపులను మరింత వేగవంతం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాలోని జెల్, భారత్‌లోని యూపీఐ మధ్య అనుసంధానం కల్పించే మార్గంపై బ్యాంక్ పనిచేస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే రెండు దేశాల మధ్య నగదు బదిలీలు మరింత సులభంగా, వేగంగా జరిగే అవకాశం ఉంది.

యూపీఐ, జెల్ మ‌ధ్య అనుసంధానం..

క్రాస్-బోర్డర్ చెల్లింపుల పరిణామంలో భారత్‌ను కీలక మార్కెట్‌గా బ్యాంక్ ఆఫ్ అమెరికా పరిగణిస్తోంది. ఈ రంగం మరింత వేగం, పారదర్శకత, సమగ్రత వైపు ముందుకు సాగుతోందని బ్యాంక్ పేర్కొంది. ఇందులో భాగంగా అమెరికాలోని జెల్‌కు, భారత్‌లోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అయిన యూపీఐకి మధ్య అనుసంధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అలాగే పలు మార్కెట్లలో రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థల వినియోగాన్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా విస్తరిస్తోంది. దీని ద్వారా మరింత వేగవంతమైన, పరస్పరం అనుసంధానమైన చెల్లింపు అనుభవాలను అందించడమే లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది.

ఈ అనుసంధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే అమెరికాలో ఉన్న భారతీయులు, భారత్‌లోని కుటుంబ సభ్యులకు డబ్బు పంపడం, అలాగే భారత్‌ నుంచి అమెరికాకు చెల్లింపులు చేయడం మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ నగదు బదిలీలకు పట్టే సమయం, మధ్యవర్తి సంస్థలపై ఆధారపడటం వంటి అంశాలను తగ్గించడంలో రియల్‌టైమ్ చెల్లింపు వ్యవస్థల అనుసంధానం కీలకంగా మారనుంది.

Advertisement
Advertisement