త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | క‌లియుగ దుశ్శాస‌నుడిలా రేవంత్ రెడ్డి: హ‌రీశ్ రావు

Harish Rao | క‌లియుగ దుశ్శాస‌నుడిలా రేవంత్ రెడ్డి (Revanth Reddy)వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. గౌర‌వ స‌భ‌.. కౌర‌వ స‌భ‌గా మారింద‌ని విమ‌ర్శించారు. ఆనాడు కౌర‌వులకు ప‌ట్టిన గ‌తే రేపు కాంగ్రెస్ (Congress) పార్టీకి ప‌డుతుంద‌ని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Sep 8, 2026, 11.00 am IST

Harish Rao | క‌లియుగ దుశ్శాస‌నుడిలా రేవంత్ రెడ్డి: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: క‌లియుగ దుశ్శాస‌నుడిలా రేవంత్ రెడ్డి (Revanth Reddy)వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. గౌర‌వ స‌భ‌.. కౌర‌వ స‌భ‌గా మారింద‌ని విమ‌ర్శించారు. ఆనాడు కౌర‌వులకు ప‌ట్టిన గ‌తే రేపు కాంగ్రెస్ (Congress) పార్టీకి ప‌డుతుంద‌ని మండిప‌డ్డారు. సీనియ‌ర్ మ‌హిళా స‌భ్యులు స‌బితా ఇంద్రారెడ్డి, సునీతా ల‌క్ష్మారెడ్డిని అవ‌మానించిన పోలీసుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హిళా స‌భ్యుల‌పై దాడి చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేస్తే.. తిరిగి వారిపైనే అక్ర‌మ కేసులు పెట్టార‌ని చెప్పారు. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం దారుణ‌మ‌న్నారు. నిన్న మా పట్ల పోలీసులు దురుసుగా పవ్రర్తించార‌ని, సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికార‌ని, సునీతా లక్ష్మారెడ్డి చీరలాగి అవమానించారని చెప్పారు. క‌లియుగ దుశ్శాస‌నుడిలా రేవంత్ రెడ్డి మారార‌ని విమ‌ర్శించారు.

హ‌రీశ్ వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన స్పీక‌ర్ (Speaker Gaddam Prasad Kumar).. మీకు కాదు ఆవేశం.. నాకు ఉండాలి. నీ త‌ల్లిని అన‌లేదు.. నా త‌ల్లిని అన్నార‌ని భావోద్వేగానికి గుర‌య్యారు. స‌బితా ఇంద్రారెడ్డి, సునీత‌, కోవా ల‌క్ష్మి ప‌ట్ల త‌న‌కు గౌరం ఉంద‌ని, త‌న ఎనిమిది మంది అక్కా చెల్లెళ్ల‌తో పాటు వారు కూడా త‌న‌కు సోద‌రీ మ‌ణులేన‌ని పేర్కొన్నారు.

అనంత‌రం హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. స్పీకర్‌గా మీపై మాకు గౌరవం ఉంది. మీ పట్ల వ్యాఖ్యలపై మా ఎమ్మెల్సీ నిన్ననే విచారం వ్యక్తం చేశారు. మేం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విచారం వ్యక్తం చేశాక.. దీనిపై రాద్ధాంతం అవసరమే లేదు. కాంగ్రెస్‌కు నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే..ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ఎందుకు చేయలేదు?, జాతి గర్వపడేలా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తాళాలు ఎందుకు వేశారు.. రేవంత్ రెడ్డికి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని హరీశ్‌ రావు అన్నారు.

Advertisement
Advertisement