త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS MLAs | స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు.. శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌

BRS MLAs | శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులను (BRS MLAs) సెషన్‌ మొత్తం సస్పెండ్ చేస్తూ స్పీకర్​ నిర్ణయం తీసుకున్నారు. హ‌రీశ్ రావు, కేటీఆర్ స‌హా మొత్తం 22 మంది స‌భ్యుల‌పై వ‌ర్షాకాల స‌మావేశాలు (Assembly Monsoon Session) ముగిసేవ వ‌ర‌కు సస్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ప్ర‌క‌టించారు.

G

Telangana | Published On Sep 9, 2026, 11.04 am IST

BRS MLAs | స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు.. శాస‌న‌స‌భ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌
Advertisement

BRS MLAs | త్రినేత్ర‌.న్యూస్‌: శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులను (BRS MLAs) సెషన్‌ మొత్తం సస్పెండ్ చేస్తూ స్పీకర్​ నిర్ణయం తీసుకున్నారు. హ‌రీశ్ రావు, కేటీఆర్ స‌హా మొత్తం 22 మంది స‌భ్యుల‌పై వ‌ర్షాకాల స‌మావేశాలు (Assembly Monsoon Session) ముగిసేవ వ‌ర‌కు సస్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ప్ర‌క‌టించారు. మూడో స‌మావేశాలు ప్రారంభమైన‌ప్ప‌టి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద‌పెట్టున నినాదాలు చేస్తూ స్పీక‌ర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మ‌హిళా ఎమ్మెల్యేల‌పై పోలీసుల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌, కేసీఆర్ చ‌నిపోవాలంటూ కోరుకున్న ఎమ్మెల్యేపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ సభను అడ్డుకున్నారు. దీంతో స‌మావేశాల‌ను అడ్డుకుంటున్న సభ్యులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి శ్రీధర్‌బాబు సిఫారసు చేశారు. దీంతో స్పీకర్ ప్ర‌సాద్ కుమార్‌​ ఆమోదించారు.

సస్పెన్సన్​ జాబితాలో హరీశ్‌రావు, కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, గంగుల, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కోవా లక్ష్మి, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్‌, విజయుడు, వివేకానంద, కె.సంజయ్‌, తలసాని, అనిల్ జాదవ్‌ ఉన్నారు. మ‌రోవైపు శాస‌న మండ‌లి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు.

Advertisement
Advertisement